దేశ పురోగతిలో యువ ఇంజనీర్ల పాత్ర కీలకం : అబ్దుల్ కలాం
ఆర్థికంగా దేశం పురోగతిలో పయనించాలంటే యువ ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే ఆబ్దుల్‌కలాం అన్నారు. హైదరాబాద్‌లోని బహుదూర్‌పల్లి టెక్ మహేంద్రా క్యాంపస్‌లోని కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులతో ఇంజనీరింగ్ టెక్నాలజీ-లీడర్‌షిప్ అనే అంశంపై ప్రసంగించారు. నేడు భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలైన జర్మనీ, జపాన్, చైనావంటివి తమ శాస్త్ర, సాంకేతిక రంగాలను వినియోగించుకుని వినూత్నమైన, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని, వాటిని ప్రపంచ మార్కెట్‌లో అధిక లాభాలకు […]
BY Pragnadhar Reddy15 May 2015 2:47 AM IST
X
Pragnadhar Reddy Updated On: 15 May 2015 2:47 AM IST
ఆర్థికంగా దేశం పురోగతిలో పయనించాలంటే యువ ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే ఆబ్దుల్‌కలాం అన్నారు. హైదరాబాద్‌లోని బహుదూర్‌పల్లి టెక్ మహేంద్రా క్యాంపస్‌లోని కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులతో ఇంజనీరింగ్ టెక్నాలజీ-లీడర్‌షిప్ అనే అంశంపై ప్రసంగించారు. నేడు భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలైన జర్మనీ, జపాన్, చైనావంటివి తమ శాస్త్ర, సాంకేతిక రంగాలను వినియోగించుకుని వినూత్నమైన, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని, వాటిని ప్రపంచ మార్కెట్‌లో అధిక లాభాలకు విక్రయిస్తున్నాయన్నారు. అదే బాటలో మనదేశం కూడా నడవాలంటే ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. విద్యార్థులు సమాజాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో 70 శాతం మంది ప్రజలు శాస్త్ర సాంకేతిక రంగాలను వినియోగించుకోలేక పోతున్నారని, వారికి అందుబాటులోకి తీసుకురావడానికి మేధావులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ ఇన్‌చార్జ్ వీసీ శైలజారామయ్యర్, సంజయ్‌దాండే, డిడియాక్లూటో, మూర్తి, శివానందరాజు, ప్రొఫెసర్ హరికిరణ్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలాం తాను రచించిన కొన్ని పుస్తకాలను కాలేజీ లైబ్రరీకి బహూకరించారు.
Next Story