నిహారిక కి డేటింగ్ అంటే తెలియదట...!
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన నాగబాబు కూతురు నిహారిక సినిమాల వైపు కాకుండా టి.వి. షో ల మీద కన్నేసింది. ఈ టి.వి. షోల్లో చేయడానికి ముందే కొన్ని షార్ట్ ఫిల్మ్ లలో నటించి తన టాలెంట్ ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ప్రస్తుత్తం ఇండియా లో బాగా ఫేమస్ అయిన డాన్స్ షో జూనియర్స్ ‘డీ’ ఆమె యాంకర్ రోల్ చేసి ఆకట్టుకుంది. మళ్ళీ ఇప్పుడు డీ జూనియర్స్ సెకండ్ సీజన్ కి రెడీ […]
BY Pragnadhar Reddy14 May 2015 4:38 AM IST
X
Pragnadhar Reddy Updated On: 14 May 2015 6:07 AM IST
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన నాగబాబు కూతురు నిహారిక సినిమాల వైపు కాకుండా టి.వి. షో ల మీద కన్నేసింది. ఈ టి.వి. షోల్లో చేయడానికి ముందే కొన్ని షార్ట్ ఫిల్మ్ లలో నటించి తన టాలెంట్ ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ప్రస్తుత్తం ఇండియా లో బాగా ఫేమస్ అయిన డాన్స్ షో జూనియర్స్ ‘డీ’ ఆమె యాంకర్ రోల్ చేసి ఆకట్టుకుంది. మళ్ళీ ఇప్పుడు డీ జూనియర్స్ సెకండ్ సీజన్ కి రెడీ అవుతుంది. దీనితో పాటు ఈ మధ్యే జెమిని టెలివిజన్ వాళ్ళు ‘గప్ చిప్’ అనే కొత్త టాకీ షో ని నిహారిక’తో స్టార్ట్ చేసారు.
గతం లో వచ్చిన ‘ప్రేమతో మీ లక్ష్మీ’, ప్రస్తుతం వస్తున్న ‘కొంచం టచ్ లో ఉంటే చెప్తాను’ లాంటి వాటిలాగేనే దీనిని స్టార్ట్ చేసారు. ఇందులో ఫస్ట్ ఎపిసోడ్ లో నిత్యా మీనన్ ని గెస్ట్ గా పిలిచి ప్రోగ్రాం ని హై రేంజ్ కి తీసుకెళ్ళారు. ఇందులో నిత్యా మీనన్ అడిగిన ప్రశ్న కి ‘ నాకు ఇప్పటివరకు డేటింగ్ అంటే ఏంటో తెలియదు, నేనెప్పుడు డేట్ కి వెళ్ళలేదు.’ అని సమాధానం చెప్పింది. కాలేజి రోజుల్లో లవ్ ప్రపోజల్స్ వచ్చినా కాని ఎవరితో కమిట్ అవ్వలేదు అని అంటుంది.
Next Story