స్మార్ట్ ఫోన్ ఉంటే ఇక మీ చేతిలో 'మీ భూమి'
భూముల వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మీ భూమి పేరుతో ఓ వెబ్‌సైట్‌ను రూపొందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో కూడా చూసుకునేట్టు దీన్నిరూపొందిస్తున్నారు. సర్వే నెంబర్‌గాని, ఖాతా నెంబరుగాని పొందుపరిస్తే మీ వివరాలు తెలిసిపోతాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు తుది దశలో ఉంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. భూ వివరాలను కంప్యూటీకరించడం, వాటిని సులభంగా చూసుకోవడం తదితర విషయాలను ఇటీవల రెవిన్యూ మంత్రి కె.ఈ.కృష్ణమూర్తి సమీక్షించారు. […]
BY Pragnadhar Reddy14 May 2015 4:47 AM IST
Pragnadhar Reddy Updated On: 14 May 2015 5:30 PM IST
భూముల వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మీ భూమి పేరుతో ఓ వెబ్‌సైట్‌ను రూపొందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో కూడా చూసుకునేట్టు దీన్నిరూపొందిస్తున్నారు. సర్వే నెంబర్‌గాని, ఖాతా నెంబరుగాని పొందుపరిస్తే మీ వివరాలు తెలిసిపోతాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు తుది దశలో ఉంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. భూ వివరాలను కంప్యూటీకరించడం, వాటిని సులభంగా చూసుకోవడం తదితర విషయాలను ఇటీవల రెవిన్యూ మంత్రి కె.ఈ.కృష్ణమూర్తి సమీక్షించారు. www.meebhumi.apgov.org.in అని టైప్ చేసి మీ భూమి వివరాలు తెలుసుకోవచ్చు. ఇందులో సర్వే నెంబర్‌గాని, ఖాతానెంబర్ గాని పొందుపరిచి అండగల్, 1బి రికార్డులను పొందవచ్చు. ఆధార్ సంఖ్య, పట్టాదారు పేరుపై కూడా రికార్డులను పరిశీలించుకునే వెసులుబాటు ఉంటుంది. మీభూమి వెబ్‌సైటులో చూసుకున్న వివరాల్లో ఏమైనా తప్పులుంటే రెవిన్యూ విభాగానికి వెళ్ళి మీ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. తహసిల్దారుకుగాని, ఈసేవలోగాని మీ ఫిర్యాదు నమోదు చేస్తే 45 రోజుల్లో మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారు. రెవిన్యూ విషయాల్లో పారదర్శకత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఆదేశించడంతో స్మార్ట్ రెవిన్యూ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు.
Next Story