Telugu Global
Others

బాబుతో నాకు పోలికేంటి: కేసీఆర్ వ్యాఖ్య‌

ఏపీ సీఎం చంద్రబాబుతో త‌న‌కు పోలికేంట‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు అన్నారు. ‘‘మాతో ఆయనకు పోలిక ఎందుకు. మాది ధనిక రాష్ట్రం. గుజరాత్‌, తెలంగాణ ధనిక రాష్ర్టాలని ప్లానింగ్‌ కమిషనే చెప్పింది. ప‌ని చేసుకోవ‌డానికి మాకే 24 గంటలు సరిపోవడంలేదు. ఆయన వ్యాఖ్యానాల గురించి ఆలోచించ‌డానికి టైమెక్క‌డిది’’ అని కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇత‌రుల గురించి ఆలోచించ‌కుండా ఎవరి పని వారు చేసుకుంటే మంచిద‌ని ఆయ‌న సూచించారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీ ఇంకా […]

బాబుతో నాకు పోలికేంటి: కేసీఆర్ వ్యాఖ్య‌
X
ఏపీ సీఎం చంద్రబాబుతో త‌న‌కు పోలికేంట‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు అన్నారు. ‘‘మాతో ఆయనకు పోలిక ఎందుకు. మాది ధనిక రాష్ట్రం. గుజరాత్‌, తెలంగాణ ధనిక రాష్ర్టాలని ప్లానింగ్‌ కమిషనే చెప్పింది. ప‌ని చేసుకోవ‌డానికి మాకే 24 గంటలు సరిపోవడంలేదు. ఆయన వ్యాఖ్యానాల గురించి ఆలోచించ‌డానికి టైమెక్క‌డిది’’ అని కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇత‌రుల గురించి ఆలోచించ‌కుండా ఎవరి పని వారు చేసుకుంటే మంచిద‌ని ఆయ‌న సూచించారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీ ఇంకా పెరగాలని, ఇప్పుడున్నది సరిపోదని అన్నారు. ‘హైదరాబాద్‌ దరిద్రంగా ఉంది. ఈ మాత్రం దానికి నేను కట్టినా ఒకటే. ఎవరు కట్టినా ఒకటే’ అంటూ హైదరాబాద్‌ ప్రస్తుత పరిస్థితిపై పెదవి విరిచారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ వస్తున్న సంగతిని ప్రస్తావించినప్పుడు ‘చాలామంది గాంధీలు వ‌స్తుంటారు… పోతుంటారు. ఆ విష‌యాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలా’ అంటూ వ్యాఖ్యానించారు. ‘సచివాలయాన్ని చెస్ట్‌ ఆస్పత్రి నుంచి కంటోన్మెంట్‌కు మారుస్తున్నారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా… ‘చెస్ట్‌ ఆస్పత్రి నుంచి కంటోన్మెంట్‌కు మారుస్తున్నట్లు మీకు ఎవరు చెప్పారు? మీరే వార్తలు రాసి, మీరే అడుగుతారా?’ అంటూ కేసీఆర్‌ ఎదురు ప్రశ్న వేశారు. ‘కళా భారతి కడతామంటే ఒక బాధ. పరిపాలనా వ్యవస్థ ఒకేచోట ఉండాలనే ఉద్దేశంతో సచివాలయం కడతామంటే మరో బాధ. అన్నీ అర్థంలేని విమర్శలు’ అని నిరసించారు. ఇదే సమయంలో హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన గురించి స్పందిస్తూ… ‘‘హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళనను ఓ స్వయం ప్రకటిత మేధావి ఒకడు విమర్శించాడు. అందులో కాలకూట విషముందన్నాడు. ఇప్పటికి మీటరున్నర నీళ్లు వదిలాం. హైదరాబాద్‌లో ఎవరికైనా రోగం వచ్చిందా? ఎవరైనా చనిపోయారా? అంత తెలివి లేకుండా, మూర్ఖంగా ప్రభుత్వం నీళ్లు వదులుతుందా?’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.
First Published:  14 May 2015 2:47 AM IST
Next Story