2 నుంచి హెచ్‌ఎండీఏలో ఆన్‌లైన్ సేవలు...!
హెచ్‌ఎండీఏ.. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దీనికి చెక్‌పెట్టలేమని భావిస్తోన్న ప్రభుత్వం.. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. దీంతో కమిషనర్ శాలినీమిశ్రా ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పలుమార్లు అడ్మినిస్ర్టేటీవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ) ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇతర సంస్థలతో పోలిస్తే హెచ్‌ఎండీఏలో ఆన్‌లైన్ సేవలకు ప్రత్యేక విధానం అవలంభించాలి. విస్తరిత ప్రాంతాల్లో మాస్టర్‌ప్లాన్ ప్రకారం అనుమతులు జారీ చేయాల్సిన దృష్ట్యా.. ప్రణాళికను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి. సర్వే నెంబర్ ఎంటర్ చేయగానే […]
BY Pragnadhar Reddy14 May 2015 4:48 AM IST
Pragnadhar Reddy Updated On: 14 May 2015 6:02 PM IST
హెచ్‌ఎండీఏ.. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దీనికి చెక్‌పెట్టలేమని భావిస్తోన్న ప్రభుత్వం.. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. దీంతో కమిషనర్ శాలినీమిశ్రా ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పలుమార్లు అడ్మినిస్ర్టేటీవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ) ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇతర సంస్థలతో పోలిస్తే హెచ్‌ఎండీఏలో ఆన్‌లైన్ సేవలకు ప్రత్యేక విధానం అవలంభించాలి. విస్తరిత ప్రాంతాల్లో మాస్టర్‌ప్లాన్ ప్రకారం అనుమతులు జారీ చేయాల్సిన దృష్ట్యా.. ప్రణాళికను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి. సర్వే నెంబర్ ఎంటర్ చేయగానే అది ఏ జోన్‌లో ఉందనే సమాచారం తెలియాలి. లేఅవుట్ ప్లాన్‌లు, డాక్యుమెంట్లు ఆటోక్యాడ్‌లో అప్‌లోడ్ చేయాలి. లే అవుట్, భవన నిర్మాణ స్థలం వీడియోలూ ఆన్‌లైన్‌లో ఉంచాలి. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించాలని భావించి ఆ బాధ్యతలను అహ్మదాబాద్‌కు చెందిన సాఫ్ట్‌టెక్ సంస్థకు అప్పగించారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం గతంలో ఆ కన్సల్టెన్సీ సాఫ్ట్‌వేర్ సిద్ధం చేసింది. దాని ఆధారంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఇంతకు ముందే అనుమతులు ఇచ్చిన, వివిధ కారణాలతో తిరస్కరించిన 4 వేల చదరపు మీటర్ల లోపున్న భవనాల ఫైళ్లను పరిశీలించారు. అంతా ఓకే అయితే త్వరలోనే ఆన్‌లైన్ జారీ ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో హెచ్‌ఎండీఏ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే కమిషనర్ ప్రణాళికా విభాగం అధికారులకు వివరించారు.
Next Story