చిరు సరసన నయనతార
చిరంజీవి 150వ సినిమాకు ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలైంది. శరవేగంగా సినిమాలు తీసే డైరక్టర్ పూరీ జగన్నాధ్.. చిరు 150వ సినిమాకు సంబంధించి అన్ని వ్యవహారాల్ని ఒక్కొక్కటిగా చక్కబెడుతున్నాడు. ఇందులో భాగంగా 150వ సినిమాలో హీరోయిన్ గా నటించే అమ్మాయి కోసం వేట మొదలుపెట్టాడు పూరి. మొత్తంగా నలుగురి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ ఎక్కువగా నయనతార వైపు మొగ్గుచూపుతోంది సినిమా యూనిట్. అన్నీ అనుకున్నట్టు జరిగితే మెగాస్టార్ సరసన ఫస్ట్ టైమ్ నయనతార […]
BY sarvi14 May 2015 5:00 AM IST

X
sarvi Updated On: 14 May 2015 5:00 AM IST
చిరంజీవి 150వ సినిమాకు ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలైంది. శరవేగంగా సినిమాలు తీసే డైరక్టర్ పూరీ జగన్నాధ్.. చిరు 150వ సినిమాకు సంబంధించి అన్ని వ్యవహారాల్ని ఒక్కొక్కటిగా చక్కబెడుతున్నాడు. ఇందులో భాగంగా 150వ సినిమాలో హీరోయిన్ గా నటించే అమ్మాయి కోసం వేట మొదలుపెట్టాడు పూరి. మొత్తంగా నలుగురి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ ఎక్కువగా నయనతార వైపు మొగ్గుచూపుతోంది సినిమా యూనిట్. అన్నీ అనుకున్నట్టు జరిగితే మెగాస్టార్ సరసన ఫస్ట్ టైమ్ నయనతార మెరవనుంది. అది కూడా ప్రతిష్టాత్మక సినిమాలో.
ఇప్పటికే వెంకటేష్, బాలయ్య, నాగార్జున లాంటి సీనియర్ల సరసన సినిమాలు చేసింది నయన్. అదే ఆమెకిప్పుడు అడ్వాంటేజ్ గా మారింది. పైగా 2కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తే ఎవరి సరసనైనా నటించడానికి సిద్ధమని ప్రకటించడంతో.. నయన్ కాల్షీట్లు సంపాదించడం పెద్ద కష్టమైన పనికాదు. త్వరలోనే నయన్ ను చెన్నైలో కలిసి కథ వినిపిస్తాడట పూరి జగన్నాధ్. అన్నట్టు నయన్ తో వర్క్ చేయడం పూరీకి కూడా ఫస్ట్ టైమ్.
Next Story