వలిగొండ పూర్తయితే కరవు దూరం: చంద్రబాబు
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రకాశం జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో కరవు ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ప్రకాశంజిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును ప్రత్యేక వాహనంలో టన్నెల్-1 లోపలికి వెళ్లి ఆయన పరిశీలించారు. టన్నెల్‌లో ఆయన సుమారు గంటపాటు గడిపారు. చంద్రబాబు వెంట మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, శిద్ధా రాఘవరావు, ముఖ్య అధికారులు ఉన్నారు. అనంతరం అక్కడ ఏర్పాడు చేసిన సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. 2016 సెప్టెంబర్ లోపు ప్రాజెక్టు […]
BY sarvi14 May 2015 12:27 PM IST
X
sarvi Updated On: 14 May 2015 12:27 PM IST
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రకాశం జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో కరవు ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ప్రకాశంజిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును ప్రత్యేక వాహనంలో టన్నెల్-1 లోపలికి వెళ్లి ఆయన పరిశీలించారు. టన్నెల్‌లో ఆయన సుమారు గంటపాటు గడిపారు. చంద్రబాబు వెంట మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, శిద్ధా రాఘవరావు, ముఖ్య అధికారులు ఉన్నారు. అనంతరం అక్కడ ఏర్పాడు చేసిన సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. 2016 సెప్టెంబర్ లోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో గనులు, ఎర్రచందనాన్ని దోచుకున్నారు తప్పితే రాష్ర్టాన్ని అభివృద్ధి చేయలేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ర్టాన్ని అంథకారంలోకి నెట్టారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ విధానాలతో రైతులు చితికిపోయారని బాబు దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ చేస్తామని టీడీపీ ప్రకటిస్తే అది సాధ్యం కాదని కాంగ్రెస్ విమర్శించిందని, దాన్ని సవాల్‌గా తీసుకుని రుణమాఫీ చేసి చూపించామని ఆయన అన్నారు. పేదలకు న్యాయం చేయడమే టీడీపీ విధానమని ఆయన స్పష్టం చేశారు. పట్టిసీమపై వైసీపీ నేతలు ఉభయ గోదావరి జిల్లాల రైతులను రెచ్చగొట్టారని ఆయన మండిపడ్డారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి కావాలనే పట్టిసీమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
Next Story