నాకు కత్రినాతో పెళ్లా?: రణబీర్
బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినాకైఫ్‌తో తన పెళ్లి వార్తలను హీరో రణబీర్ కపూర్ ఖండించారు. తానూ కత్రినా ప్రేమించుకుంటున్న విషయం వాస్తవమే కానీ పెళ్లికి ఎలాంటి సన్నాహాలు చేయడం లేదని స్పష్టం చేశారు. మేమిద్దరం సినిమాల్లో ఇప్పటికే బిజీగా ఉన్నాం. మాకు ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. కత్రినా, రణబీర్ కపూర్ లు వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని కొన్నిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో వీరి ప్రేమ ముదిరి పెళ్లి పీటలు ఎక్కుతుందనుకున్నారంతా! కానీ, రణబీర్ తాజా […]
BY Pragnadhar Reddy13 May 2015 3:12 AM IST

X
Pragnadhar Reddy Updated On: 13 May 2015 4:29 AM IST
బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినాకైఫ్‌తో తన పెళ్లి వార్తలను హీరో రణబీర్ కపూర్ ఖండించారు. తానూ కత్రినా ప్రేమించుకుంటున్న విషయం వాస్తవమే కానీ పెళ్లికి ఎలాంటి సన్నాహాలు చేయడం లేదని స్పష్టం చేశారు. మేమిద్దరం సినిమాల్లో ఇప్పటికే బిజీగా ఉన్నాం. మాకు ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. కత్రినా, రణబీర్ కపూర్ లు వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని కొన్నిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో వీరి ప్రేమ ముదిరి పెళ్లి పీటలు ఎక్కుతుందనుకున్నారంతా! కానీ, రణబీర్ తాజా ప్రకటనతో అంతా పునరాలోచనలో పడ్డారు. ఈ ప్రేమ పక్షులు పెళ్లి గూటికి చేరతాయా? లేదా అని బాలీవుడ్ వర్గాలు, ప్రేక్షకులు చెవులు కొరుక్కుంటున్నారు.
Next Story