రాహుల్ రైతు భరోసా యాత్రకు సర్వం సిద్ధం
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో రైతు భరోసా యాత్రకు సర్వం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లాలో రైతు భరోసా యాత్ర చేసేందుకు వస్తున్న ఆయన రేపు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ చేరుకుంటారని పీసీసీ సమన్వయకర్త భట్టి విక్రమార్క చెప్పారు. ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరిన వెంటనే అక్కడ ఎంపిక చేసిన రైతులతోను, పీసీసీ ప్రతినిధులతోను సమావేశమవుతారు. 45 నిమషాలసేపు జరిగే ఈ సమావేశంలో ఆయన రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆయన ఆదిలాబాద్ […]
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో రైతు భరోసా యాత్రకు సర్వం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లాలో రైతు భరోసా యాత్ర చేసేందుకు వస్తున్న ఆయన రేపు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ చేరుకుంటారని పీసీసీ సమన్వయకర్త భట్టి విక్రమార్క చెప్పారు. ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరిన వెంటనే అక్కడ ఎంపిక చేసిన రైతులతోను, పీసీసీ ప్రతినిధులతోను సమావేశమవుతారు. 45 నిమషాలసేపు జరిగే ఈ సమావేశంలో ఆయన రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆయన ఆదిలాబాద్ జిల్లా పర్యటన ఏర్పాట్లపైన, అక్కడ కార్యక్రమంపైన పీసీసీ నేతల నుంచి సమాచారం తెలుసుకుంటారు. శంషాబాద్ నుంచి నిర్మల్ వెళ్ళే దారిలో అక్కడక్కడా ఆయన ఎంపిక చేసిన ప్రాంతాల్లో రైతుల నుంచి విన్నపాల్ని స్వీకరిస్తారు. రాత్రికి నిర్మల్‌లోని మయూర ఇన్ హోటల్‌లో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఆయన ఆదిలాబాద్ జిల్లాలోని కొరిటికల్, లక్ష్మణ్‌చాందా, పొట్టుపల్లి, రాచాపూర్ మీదుగా వాడియల్ వరకు పాదయాత్ర జరుపుతారు. అక్కడే సాయంత్రం 4 గంటలకు రాహుల్ రైతులతో సమావేశమవుతారు. హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ రోడ్ షో ఉండదని ఆయన చెప్పారు. బాధిత రైతుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం అందజేస్తారని భట్టి తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4.45 గంటలకు రాహుల్ నిర్మల్ నుంచి హైదరాబాద్ వస్తారు. అదే రోజు సాయంత్రం 9 గంటలకు ఢిల్లీ వెళ్ళిపోతారని భట్టి విక్రమార్క తెలిపారు. కాగా రైతుల్లో భరోసా కల్పించడానికే రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. రాహుల్ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని, బడుగు బలహీనవర్గాలకు ఆసరాగా నిలబడాలన్నది ఆయన లక్ష్యమని ఆయన అన్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత 900 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరిని కూడా ఆయన పలకరించిన పాపాన పోలేదని, ఢిల్లీలో ఉన్న రాహుల్‌గాంధీ విషయం తెలుసుకుని చలించిపోయారని, వారి కుటుంబాల పరామర్శించి ఆర్థిక సాయం చేయడానికి వస్తున్నారని శ్రీనివాస్ తెలిపారు.