Telugu Global
International

రూ.160 కోట్ల‌కు లాడెన్‌ ఆచూకీ చెప్పిన పాక్ అధికారి!

అల్‌ఖైదా అధినేత‌, 9/11 దాడుల సూత్ర‌ధారి ఒసామా బిన్ లాడెన్ ఆచూకీని చెప్పింది ఎవ‌రో తెలిసిపోయింది. 2011, మే 2న అబోట్టాబాద్‌లోని ఓ ర‌హ‌స్య స్థావ‌రంలో దాక్కున్న బిన్‌లాడెన్‌ను అమెరికా ద‌ళాలు ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ నిర్వ‌హించి మ‌ట్టుబెట్టిన సంగ‌తి తెలిసిందే. బిన్‌లాడెన్ త‌మ వ‌ద్ద లేడ‌ని చాలాకాలం పాటు వాదిస్తూ వ‌చ్చిన పాక్ కు ఈ ఆప‌రేష‌న్‌తో నోరు మూత‌బ‌డింది. ఇంత‌కీ అమెరికాపై యుద్ధం ప్ర‌క‌టించిన లాడెన్ ఆచూకీ ఎలా తెలిసింద‌నేగా మీ అనుమానం. 2010లో పాక్ […]

అల్‌ఖైదా అధినేత‌, 9/11 దాడుల సూత్ర‌ధారి ఒసామా బిన్ లాడెన్ ఆచూకీని చెప్పింది ఎవ‌రో తెలిసిపోయింది. 2011, మే 2న అబోట్టాబాద్‌లోని ఓ ర‌హ‌స్య స్థావ‌రంలో దాక్కున్న బిన్‌లాడెన్‌ను అమెరికా ద‌ళాలు ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ నిర్వ‌హించి మ‌ట్టుబెట్టిన సంగ‌తి తెలిసిందే. బిన్‌లాడెన్ త‌మ వ‌ద్ద లేడ‌ని చాలాకాలం పాటు వాదిస్తూ వ‌చ్చిన పాక్ కు ఈ ఆప‌రేష‌న్‌తో నోరు మూత‌బ‌డింది. ఇంత‌కీ అమెరికాపై యుద్ధం ప్ర‌క‌టించిన లాడెన్ ఆచూకీ ఎలా తెలిసింద‌నేగా మీ అనుమానం. 2010లో పాక్ గుఢాచార విభాగానికి చెందిన ఓ అధికారి ఇస్లామాబాద్‌లోని అమెరికా దౌత్య కార్యాల‌యానికి వెళ్లాడు. అక్క‌డ 9/11 దాడుల సూత్ర‌ధారి ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ తెలిపిన వారికి అమెరికా 25 మిలియ‌న్ల అమెరికన్ డాలర్ల ( భార‌త క‌రెన్సీలో దాదాపు రూ. 160కోట్లు) బ‌హుమానం ప్ర‌క‌టించిన సంగ‌తి ప్ర‌స్తావించాడు. ఆ మొత్తం త‌న‌కిస్తే లాడెన్ ఆచూకీ చెబుతాన‌ని ష‌ర‌తు విధించాడు. దీనికి ఓకే చెప్పిన అమెరికా ఆ డ‌బ్బు చెల్లించి అబోటాబాద్‌లో లాడెన్ త‌ల‌దాచుకున్న విషయం తెలుసుకుంది. ఈ విష‌యం పాక్‌కు ముందుగానే చెబితే లాడెన్‌ను త‌ప్పిస్తుంద‌ని చెప్ప‌కుండా ఆప‌రేష‌న్ పూర్తి చేసింది. ఇప్పుడు ఆ పాక్ అధికారి వాషింగ్ట‌న్‌లో త‌ల‌దాచుకుంటున్నాడ‌ట‌. సీఐఏ కోసం ప‌ని చేస్తున్నాడని మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.
First Published:  13 May 2015 4:52 AM IST
Next Story