జూన్ నాటికి అమరావతికి రాజధాని కళ
వచ్చే జూన్ రెండో తేదీ నాటికి ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలన్నింటినీ రాజధాని ప్రాంతానికి తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల సమయం కూడా లేనందున అధికారులు చకచకా అమరావతి ప్రాంతానికి రాజధాని కళ రప్పించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గుంటూరులోని చుట్టుగుంట సెంటర్‌కు సమీపంలోనే ఉన్న మార్కెట్ కమిటీ భవనంలో రాష్ట్ర మునిసిపల్ పరిపాలన శాఖ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. దీంతోపాటుగా మరికొన్ని ప్రభుత్వ ప్రధాన […]
BY Pragnadhar Reddy12 May 2015 11:47 PM IST
X
Pragnadhar Reddy Updated On: 13 May 2015 4:40 AM IST
వచ్చే జూన్ రెండో తేదీ నాటికి ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలన్నింటినీ రాజధాని ప్రాంతానికి తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల సమయం కూడా లేనందున అధికారులు చకచకా అమరావతి ప్రాంతానికి రాజధాని కళ రప్పించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గుంటూరులోని చుట్టుగుంట సెంటర్‌కు సమీపంలోనే ఉన్న మార్కెట్ కమిటీ భవనంలో రాష్ట్ర మునిసిపల్ పరిపాలన శాఖ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. దీంతోపాటుగా మరికొన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు కూడా మరో 15 నుంచి 20 రోజుల్లో ఇక్కడికి తరలి వస్తాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతో పాటుగా ఒక భవనాన్ని కూడా ఆయనకు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యాలయాలు తరలించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో తొలిగా మంత్రి నారాయణ స్పందించారు. మునిసిపల్ పరిపాలన శాఖ కార్యాలయాన్ని జూన్ 2వ తేదీ లోపే గుంటూరు మార్కెట్ కమిటీ గెస్టు హౌస్ ప్రాంగణంలోని రైతు విశ్రాంతి భవన్‌లో ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సీఎం జారీ చేసిన తాజా ఆదేశాలతో జిల్లాకు రాజధాని శోభ వస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
Next Story