నూజివీడులో నేషనల్ మైనింగ్ రీసెర్చ్ సంస్థ
నేషనల్ మైనింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను నూజివీడులో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఏర్పాటవుతున్న విద్యాసంస్థకు నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలో భూముల పరిశీలించనున్నారు. తొలుత నిట్, పోలీస్ అకాడమి తదితర వాటి ఏర్పాటుకు నూజివీడు ప్రాంతాన్ని పరిశీలించారు. పలు కారణాలతో అవి వేరే ప్రాంతాలకు తరలిపోయాయి. నూజివీడు ప్రాంతంలో దాదాపు 37 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉండడంతో మైనింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు […]
BY sarvi12 May 2015 6:31 PM IST
sarvi Updated On: 13 May 2015 4:06 AM IST
నేషనల్ మైనింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను నూజివీడులో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఏర్పాటవుతున్న విద్యాసంస్థకు నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలో భూముల పరిశీలించనున్నారు. తొలుత నిట్, పోలీస్ అకాడమి తదితర వాటి ఏర్పాటుకు నూజివీడు ప్రాంతాన్ని పరిశీలించారు. పలు కారణాలతో అవి వేరే ప్రాంతాలకు తరలిపోయాయి. నూజివీడు ప్రాంతంలో దాదాపు 37 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉండడంతో మైనింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో బీహార్‌లోని ధన్‌బాద్‌లో మాత్రమే ఈ ఇన్‌స్టిట్యూట్ ఉంది. దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నూజివీడును పరిశీలిస్తుంది. ఇక్కడి భూములను పరిశీలించేందుకు ధన్‌బాద్ నుంచి ఓ బృందం రానుంది. నేషనల్ మైనింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు దాదాపు 300 ఎకరాలు అవసరమవుతాయి.
Next Story