హుస్సేన్‌సాగర్ చుట్టూ మోనో రైలు
హైదరాబాద్ నగరాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దేశ, విదేశీయులను అమితంగా ఆకర్షించడానికి వీలుగా నగరంలో టూరిజం అభివృద్ధికి సన్నాహాలు జరుగుతున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మోనో రైలు ప్రవేశపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. నగరంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను ఒకే రోజు సందర్శించడానికి వీలుగా లండన్, పారిస్ నగరాల తరహాలో ఆన్-ఆఫ్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా పర్యాటక శాఖ బస్సుల్లో ప్రయాణిస్తే వారు నిర్దేశించిన సమయం ప్రకారం, […]
BY sarvi13 May 2015 3:38 AM IST
X
sarvi Updated On: 14 May 2015 4:58 AM IST
హైదరాబాద్ నగరాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దేశ, విదేశీయులను అమితంగా ఆకర్షించడానికి వీలుగా నగరంలో టూరిజం అభివృద్ధికి సన్నాహాలు జరుగుతున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మోనో రైలు ప్రవేశపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. నగరంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను ఒకే రోజు సందర్శించడానికి వీలుగా లండన్, పారిస్ నగరాల తరహాలో ఆన్-ఆఫ్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా పర్యాటక శాఖ బస్సుల్లో ప్రయాణిస్తే వారు నిర్దేశించిన సమయం ప్రకారం, పర్యాటక ప్రాంతాలను సందర్శించి తిరిగి రావాల్సి ఉంటుంది. కానీ ఈ ఆన్-ఆఫ్ బస్సు టిక్కెట్‌ను కొనుగోలు చేస్తే మనకు నచ్చిన పర్యాటక ప్రాంతంలో దిగి ఇష్టమైనంత సేపు గడపవచ్చు. ఆ తర్వాత వెనక వచ్చే బస్సులో ఎక్కి మళ్ళీ కావలసిన చోటుకు వెళ్ళవచ్చు. ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం దీని ప్రత్యేకత. ఈ ప్రతిపాదనలతో టూరిజం డవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
సాగర్ చుట్టూ ఉన్న లుంబినీ పార్క్, సంజీవయ్య పార్క్ తదితర ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మోనో రైలు ప్రాజెక్టు ఉంటుంది. మోనో రైలు ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ ఇది పట్టాలు ఎక్కాలంటే హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన తర్వాతే సాధ్యమని అధికారులు భావిస్తున్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి మోనో రైలు, ఆన్-ఆఫ్ రైలు వంటి సౌకర్యాలే కాకుండా సింగపూర్‌లోని సెంటోస్ ఐలాండ్ చికాగో మిషేగన్ లేక్, అక్వేరియంను పోలిన విధంగా అండర్ గ్రౌండ్ ఆక్క్వేరియం నిర్మించే ఆలోచనలో కూడా అధికారులున్నారు. మొత్తానికి హైదరాబాద్‌ను ఓ అద్బుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది.
Next Story