ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు...
దేశంలోని నాలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది. దీంతోపాటు యూపీఏ హయాంలో నియమితులైన ఇద్దరు గవర్నర్లను బదిలీ చేసింది. మొత్తం ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లు ఏర్పడ్డారు. ఇందులో నలుగురు కొత్తవారు కాగా ఇద్దరు రెండు రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీచేశారు. ఒడిసా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ద్రౌపతి ముర్ము (56) జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. పశ్చిమబెంగాల్ బీజేపీ సీనియర్ నేత […]
BY sarvi12 May 2015 1:02 PM GMT
sarvi Updated On: 12 May 2015 10:35 PM GMT
దేశంలోని నాలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది. దీంతోపాటు యూపీఏ హయాంలో నియమితులైన ఇద్దరు గవర్నర్లను బదిలీ చేసింది. మొత్తం ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లు ఏర్పడ్డారు. ఇందులో నలుగురు కొత్తవారు కాగా ఇద్దరు రెండు రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీచేశారు. ఒడిసా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ద్రౌపతి ముర్ము (56) జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. పశ్చిమబెంగాల్ బీజేపీ సీనియర్ నేత తథాగత రాయ్ (68)ని త్రిపురకు, అసోం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె.పి.రాజ్‌ఖోవాను అరుణాచల్ ప్రదేశ్‌కు, ఆరెస్సెస్ ప్రముఖ నేత వి.షణ్ముగనాథన్‌ను మేఘాలయకు గవర్నర్లుగా నియమించారు. ఇక జార్ఖండ్ ప్రస్తుత గవర్నర్ సయ్యద్ అహ్మద్‌ను మణిపూర్‌కు, అరుణాచల్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) నిర్భయ్‌శర్మను మిజోరామ్‌కు బదిలీ చేశారు.
Next Story