స్ట్రీట్ ఫైట్‌కు మరో ఇద్దరు బలి?
స్ట్రీట్ ఫైట్‌లో ఇంతకుముందే ఇద్దరు చనిపోయినట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. అయితే ఈ ఫైట్‌లో సంపన్న వర్గాల పిల్లలే పాల్గొంటున్నందున నిజాలు వెలుగులోకి రావడం లేదని తేలింది. హుక్కా సెంటర్లు, పబ్‌లలో ఎంజాయ్ చేసే గ్యాంగులే ఈ స్ట్రీట్ ఫైట్‌లో దిగుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. నబీల్ కేసుపై విచారణ జరుపుతున్న దర్యాప్తు బృందానికి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కాగా నబీల్ కేసులో పోస్టుమార్టం నివేదిక పోలీసుల చేతికి అందింది.నబీల్ తలపై 9 చోట్ల బలమైన గాయాలున్నట్టు […]
BY sarvi11 May 2015 4:05 PM GMT
sarvi Updated On: 12 May 2015 6:11 AM GMT
స్ట్రీట్ ఫైట్‌లో ఇంతకుముందే ఇద్దరు చనిపోయినట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. అయితే ఈ ఫైట్‌లో సంపన్న వర్గాల పిల్లలే పాల్గొంటున్నందున నిజాలు వెలుగులోకి రావడం లేదని తేలింది. హుక్కా సెంటర్లు, పబ్‌లలో ఎంజాయ్ చేసే గ్యాంగులే ఈ స్ట్రీట్ ఫైట్‌లో దిగుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. నబీల్ కేసుపై విచారణ జరుపుతున్న దర్యాప్తు బృందానికి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కాగా నబీల్ కేసులో పోస్టుమార్టం నివేదిక పోలీసుల చేతికి అందింది.నబీల్ తలపై 9 చోట్ల బలమైన గాయాలున్నట్టు గుర్తించారు. ఈ గాయాల కారణంగానే ఆయన చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అసలు నివేదిక బయటకు వస్తే నబీల్ స్ట్రీట్ ఫైట్‌లో సహజంగా తగిలిన దెబ్బలకు చనిపోయాడా లేక ఉద్దేశ్యపూర్వకంగా అతన్ని చంపేశారా అన్న విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. నబీల్ మరణానికి సంబంధించిన వ్యవహారంలో ఓ పోలీసాఫీసర్ పాత్ర కూడా ఉందన్న అనుమానాలు రావడంతో ఇపుడీ కేసు చాలా ఆసక్తికరంగా మారింది.
Next Story