మధుమేహాన్ని అదుపు చేసే మామిడి!
చూడగానే నోరూరించే మధుర ఫలం మామిడి పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడదంటూ ఆంక్షలు విధిస్తుంటాం. మామిడి తియ్యగా ఉంటుంది కాబట్టి మధుమేహం స్థాయి పెరిగిపోతుందని అపోహపడుతుంటాం. ఊబకాయుల్లో చక్కెర స్థాయిలు మెరుగుపడడానికి మామిడిపండ్లు దోహదం చేస్తాయని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రతిరోజూ మామిడిపండ్లను తినడం వల్ల ఊబకాయులపై పడే ప్రభావాలపై ఒక్లహామా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల అధ్యయనం చేశారు. ఒక్కొక్కరికి 100 గ్రాముల తాజా మామిడిపండ్లతో సమానమైన 10 గ్రాముల మామిడి తాండ్రను తినిపించారు. పన్నెండు […]
BY Pragnadhar Reddy12 May 2015 4:55 AM IST
X
Pragnadhar Reddy Updated On: 12 May 2015 9:18 AM IST
చూడగానే నోరూరించే మధుర ఫలం మామిడి పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడదంటూ ఆంక్షలు విధిస్తుంటాం. మామిడి తియ్యగా ఉంటుంది కాబట్టి మధుమేహం స్థాయి పెరిగిపోతుందని అపోహపడుతుంటాం. ఊబకాయుల్లో చక్కెర స్థాయిలు మెరుగుపడడానికి మామిడిపండ్లు దోహదం చేస్తాయని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రతిరోజూ మామిడిపండ్లను తినడం వల్ల ఊబకాయులపై పడే ప్రభావాలపై ఒక్లహామా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల అధ్యయనం చేశారు. ఒక్కొక్కరికి 100 గ్రాముల తాజా మామిడిపండ్లతో సమానమైన 10 గ్రాముల మామిడి తాండ్రను తినిపించారు. పన్నెండు వారాల తర్వాత పరిశీలించగా వారి రక్తంలోని గ్లూకోజు మోతాదులు గణనీయంగా తగ్గినట్లు తేలింది. అయితే మామిడి పండ్లలోని ఏఏ పాలీ ఫెనోలిక్ రసాయనాలు ఇందుకు దోహదం చేస్తున్నాయో తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందట.
Next Story