Telugu Global
Others

ప్రత్యేక హోదాపై బాలయ్య సెటైర్లు

ప్రస్తుతం ఏపీలో ప్రత్యేక హోదాపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. స్పెషల్ స్టేటస్ వస్తుందా రాదా అనే డిస్కషన్ ఎక్కువైంది. దీనికి తోడు రాజకీయ నాయకులు కూడా మైక్ దొరికిందే తడవుగా ప్రత్యేక హోదాపై ఏదో ఒక కామెంట్ పడేస్తున్నారు. అన్ని పార్టీలకు ఇదిప్పుడు అవసరంగా మారింది. అయితే ఇన్నాళ్లూ ఈ విషయంపై నోరు మెదపని బాలకృష్ణ, తొలిసారి ప్రత్యేక హోదాపై స్పందించారు. అందర్లా స్పందిస్తే అందులో బాలయ్య ప్రత్యేకతేముంది.. అందుకే తనదైన శైలిలో స్పందించారు బాలయ్య. […]

ప్రత్యేక హోదాపై బాలయ్య సెటైర్లు
X
ప్రస్తుతం ఏపీలో ప్రత్యేక హోదాపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. స్పెషల్ స్టేటస్ వస్తుందా రాదా అనే డిస్కషన్ ఎక్కువైంది. దీనికి తోడు రాజకీయ నాయకులు కూడా మైక్ దొరికిందే తడవుగా ప్రత్యేక హోదాపై ఏదో ఒక కామెంట్ పడేస్తున్నారు. అన్ని పార్టీలకు ఇదిప్పుడు అవసరంగా మారింది. అయితే ఇన్నాళ్లూ ఈ విషయంపై నోరు మెదపని బాలకృష్ణ, తొలిసారి ప్రత్యేక హోదాపై స్పందించారు. అందర్లా స్పందిస్తే అందులో బాలయ్య ప్రత్యేకతేముంది.. అందుకే తనదైన శైలిలో స్పందించారు బాలయ్య. ప్రత్యేక హోదా కోసం ఏపీ సీఎం చంద్రబాబు నరేంద్ర మోడీతో మాట్లాడుతున్నారని చెబుతూనే.. అసలు ప్రత్యేక హోదా ఎందుకు.. అది వస్తే రాష్ట్రానికి నిజంగా ప్రయోజనం ఉంటుందా.. అనే విషయాల్ని కూడా ఆలోచించాలన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఏం అవుతుంది.. రాకపోతే ఏం జరుగుతుంది.. అసలు ప్రత్యేక హోదా అవసరమా.. ఇలా తనదైన స్టయిల్ లో అర్థం అయినట్టు కానట్టు ఏదేదో మాట్లాడేశారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. దీంతో విలేకర్లతో పాటు పక్కనే ఉన్న మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా షాకయ్యారు. వెంటనే తేరుకున్న మంత్రి మేటర్ మొత్తాన్ని చిటికెలో సర్దేశారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వం కేంద్రంతో పోరాడుతోందని పొలిటికల్ గా కొన్ని కామెంట్స్ చేసి మేటర్ ను కామప్ చేశారు.
First Published:  12 May 2015 2:10 AM IST
Next Story