ఇవ్వక పోతే ఊరుకోదట..!
హీరో కథల చుట్టూ తిరిగే చోట హీరోయిన్స్ కు స్క్రీన్ స్పేస్ తక్కువనే చెప్పాలి. ఇదే విషయం గురించి మన హీరోయిన్స్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్లు చెబుతారు. కొందరు..హీరో పేరు మీదనే సినిమా బిజినెస్ జరుగుతుంటుంది కాబట్టి హీరో సెంట్రిక్ నడవడం తప్పుకాదంటారు. మరి కొందరు హీరోయిన్స్ మేం తక్కువ కాదు? పోటి పడగలం అంటుంటారు. ఇదే తరహాలో అందాల ముద్దుగుమ్మ రాసిఖన్నా నటనకు హీరోయిన్స్ కు సరిపడ స్కోప్ ఇవ్వాల్సిందే అంటోంది. ఎందుకంటే […]
BY sarvi11 May 2015 7:50 AM IST
X
sarvi Updated On: 11 May 2015 10:24 AM IST
హీరో కథల చుట్టూ తిరిగే చోట హీరోయిన్స్ కు స్క్రీన్ స్పేస్ తక్కువనే చెప్పాలి. ఇదే విషయం గురించి మన హీరోయిన్స్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్లు చెబుతారు. కొందరు..హీరో పేరు మీదనే సినిమా బిజినెస్ జరుగుతుంటుంది కాబట్టి హీరో సెంట్రిక్ నడవడం తప్పుకాదంటారు. మరి కొందరు హీరోయిన్స్ మేం తక్కువ కాదు? పోటి పడగలం అంటుంటారు. ఇదే తరహాలో అందాల ముద్దుగుమ్మ రాసిఖన్నా నటనకు హీరోయిన్స్ కు సరిపడ స్కోప్ ఇవ్వాల్సిందే అంటోంది. ఎందుకంటే హీరోయిన్స్ ఎల్ల కాలం గ్లామర్ నే నమ్మకుని కెరీర్ ను కంటిన్యూ చేయలేరు కదా..? యాక్టింగ్ పరంగా వాళ్లు ప్రూవ్ చేసుకోకపోతే కెరీర్ పరంగా త్వరగా ఫేడ్ అవుటయిపోతారు కదా అనే లాజిక్ మాట్లాడుతుంది. నిజమే కదా.? అయితే తనకు లక్కీగా అన్ని మంచి పాత్రలే వచ్చాయని చెప్పింది. బెంగాల్ టైగర్ చిత్రంలో ఒక హీరోయిన్ గా చేసింది. రామ సరసన శివం చిత్రం చేయనుంది. మొత్తం మీద హీరోయిన్స్ ను అన్యాయం చేయోద్దనేది రాసిఖన్నా డిమాండ్ మరి.!
Next Story