ఇక నేను ఎన్నికలకు దూరం: కిరణ్‌బేడీ
ఢిల్లీ ఎన్నికలు తనకు ముందెన్నడూ లేనంతటి అద్భుత అనుభవాన్నిచ్చాయని, తాను చేయాల్సిందేదో.. చేయకూడనిదేదో నేర్పాయని మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీ అన్నారు. ఆమె అన్న ఈ మాటల్లో రాజకీయ వైరాగ్యం కనిపిస్తోంది. ఇకపై తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ఆమె స్పష్టం చేయడం ఆమెలో రాజకీయాల పట్ల ఎంత నైరాశ్యం అలముకుందో స్పష్టం చేస్తోంది. ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో, బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన కిరణ్‌బేడీ, ఘోరమైన ఓటమిని చవి చూశారు. ఈ […]
BY Pragnadhar Reddy10 May 2015 8:51 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 11 May 2015 2:07 AM GMT
ఢిల్లీ ఎన్నికలు తనకు ముందెన్నడూ లేనంతటి అద్భుత అనుభవాన్నిచ్చాయని, తాను చేయాల్సిందేదో.. చేయకూడనిదేదో నేర్పాయని మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీ అన్నారు. ఆమె అన్న ఈ మాటల్లో రాజకీయ వైరాగ్యం కనిపిస్తోంది. ఇకపై తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ఆమె స్పష్టం చేయడం ఆమెలో రాజకీయాల పట్ల ఎంత నైరాశ్యం అలముకుందో స్పష్టం చేస్తోంది. ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో, బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన కిరణ్‌బేడీ, ఘోరమైన ఓటమిని చవి చూశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల తర్వాత జీవితం ఎలా ఉంది అన్న మీడియా ప్రశ్నకు ఆమె రాజకీయ వైరాగ్యాన్ని కనబరిచారు. తాను చురుకైన రాజకీయవేత్తనే కానని చెప్పారు. అయితే, ప్రజాసేవపట్ల అనురక్తి మాత్రం తగ్గలేదని, ప్రజలకు సేవ చేయడానికి ఉన్న మార్గాలన్నీ అనుసరిస్తానని అన్నారు.
Next Story