రాష్ట్ర విభజన రహస్యాలపై కిరణ్ పుస్తకం?
ఏపీ రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది? ఎవరేం చేశారు? బయట చెప్పే మాటలకు లోపల చేసిన పనులకు మధ్య పొంతన ఉందా? విభజన ఎపిసోడ్‌లో తెర చాటున ఎవరేం చేశారు? రాజకీయ పార్టీలు.. ఆ పార్టీ అధినేతలు ఎలా వ్యవహరించారు? ఇలా చెప్పుకుంటూ పోతే.. రాష్ట్ర విభజనకు సంబంధించిన ఎన్నో తెరచాటు వివరాలు త్వరలో బయటకు రానున్నాయి. రాష్ట్ర విభజనను విపరీతంగా వ్యతిరేకించిన అవిభాజ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి రాస్తున్న పుస్తకంలో విభజనకు సంబంధించిన […]
BY Pragnadhar Reddy11 May 2015 1:27 AM IST
X
Pragnadhar Reddy Updated On: 11 May 2015 6:26 AM IST
ఏపీ రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది? ఎవరేం చేశారు? బయట చెప్పే మాటలకు లోపల చేసిన పనులకు మధ్య పొంతన ఉందా? విభజన ఎపిసోడ్‌లో తెర చాటున ఎవరేం చేశారు? రాజకీయ పార్టీలు.. ఆ పార్టీ అధినేతలు ఎలా వ్యవహరించారు? ఇలా చెప్పుకుంటూ పోతే.. రాష్ట్ర విభజనకు సంబంధించిన ఎన్నో తెరచాటు వివరాలు త్వరలో బయటకు రానున్నాయి. రాష్ట్ర విభజనను విపరీతంగా వ్యతిరేకించిన అవిభాజ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి రాస్తున్న పుస్తకంలో విభజనకు సంబంధించిన అన్ని వివరాలు బయటకు రానున్నాయి. విభజన ఎపిసోడ్‌లో కాంగ్రెస్.. బీజేపీ.. టీడీపీ మొదలుకొని రాజకీయ పార్టీలు వ్యవహరించిన వైఖరి.. బయట వారు చెప్పిన మాటలకు.. అంతర్గతంగా వారు కదిపిన పావులతోపాటు.. తెర చాటున జరిగిన ప్రతి విషయాన్ని కిరణ్‌కుమార్ రెడ్డి తన పుస్తకంతో బయట పెడతారని చెబుతున్నారు.
ఇంకా పేరు పెట్టని ఈ పుస్తకం కానీ బయటకు వస్తే.. ఎన్నో సంచలనాత్మక విషయాలు బయటకు వస్తాయంటున్నారు. విభజన నిర్ణయాన్ని సోనియాగాందీ ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక ఎవరి పాత్ర ఉందన్న అంశాలతోపాటు.. కాంగ్రెస్ పార్టీకి తనకు మధ్య జరిగిన చర్చల సారాన్ని ఈ పుస్తకంలో వెల్లడిస్తారని చెబుతున్నారు. దాదాపు 400 పేజీలు ఉండే ఈ పుస్తకం విడుదల చేయడం ద్వారా కిరణ్‌కుమార్ రెడ్డి మరోసారి రాజకీయ అరంగ్రేటం చేస్తారని అంటున్నారు. అవిభాజ్యిత ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి రాసే ఈ పుస్తకం అనేక సంచలనాలకు తెర లేపుతుందన్నది చాలామంది భావిస్తున్నారు.-పీఆర్
Next Story