Telugu Global
CRIME

ప్ర‌వాస విద్యార్థినిపై అమానుష ఘాతుకం!

వారణాసిలోని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న భారత సంతతికి చెందిన అమెరికన్‌ యువతిపై ఇటీవల అత్యాచార యత్నం జరిగింది. ఆయుర్వేదపై పీహెచ్‌డీ చేస్తున్న ఆ మహిళపై క్యాంపస్‌లో ఐదుగురు వ్యక్తులు ఏప్రిల్‌ 22న అత్యాచార యత్నానికి పాల్పడగా, ఆమె గట్టిగా పోరాడి తనను తాను రక్షించుకుంది. దీనిపై ఏప్రిల్‌ 28న ఆమె వారణాసి ఎస్‌పీని కలిసి ఫిర్యాదు చేసినా మే ఒకటి దాకా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఆమె తెలిపారు. తొలుత ఈ కేసును కప్పిపెట్టేందుకు ప్రయత్నాలు […]

వారణాసిలోని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న భారత సంతతికి చెందిన అమెరికన్‌ యువతిపై ఇటీవల అత్యాచార యత్నం జరిగింది. ఆయుర్వేదపై పీహెచ్‌డీ చేస్తున్న ఆ మహిళపై క్యాంపస్‌లో ఐదుగురు వ్యక్తులు ఏప్రిల్‌ 22న అత్యాచార యత్నానికి పాల్పడగా, ఆమె గట్టిగా పోరాడి తనను తాను రక్షించుకుంది. దీనిపై ఏప్రిల్‌ 28న ఆమె వారణాసి ఎస్‌పీని కలిసి ఫిర్యాదు చేసినా మే ఒకటి దాకా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఆమె తెలిపారు. తొలుత ఈ కేసును కప్పిపెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయనీ, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చాకే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని పేర్కొన్నారు. ‘‘భయోత్పాతం కలిగించే మ‌రో అమానుష చ‌ర్య ఏమిటంటే… ఒక మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్‌ సమక్షంలో ఇద్దరు మగ డాక్టర్ల చేత ఆమెకు వైద్య పరీక్షలు జరిపించడం. మగవాళ్లే ఒక మహిళకు వైద్య పరీక్షలు జరపడమంటే రేప్‌ చేయడం కన్నా ఘోరం’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
First Published:  9 May 2015 8:00 PM IST
Next Story