Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 78

రాజు: నీ బ్యాగులో ఏమిటవి? రంగ: కోళ్ళు రాజు: వాటిల్లో నాకొకటి ఇయ్యవూ? రంగ: ఇవ్వను రాజు: సరే! పోనీ నీ సంచిలో ఎన్ని కోళ్ళున్నాయో నేను కరెక్టుగా చెబుతే నాకొకటిస్తావా? రంగ: నువ్వు కరెక్ట్‌గా చెబితే దీంట్లో వున్న రెండూ నీకిచ్చేస్తా! ——————-  ఒక పార్టీలో ఒక టేబుల్‌ కాసేపు ఇక్కడ వుంటే మరికొంతసేపటికి మరో చోట కనిపిస్తోంది. వెయిటర్‌ ఆశ్చర్యపోయి “ఏమైంది దీనికి?” అని అడిగాడు. “ఎవరో గెస్టు ఒక బాటిల్‌ విస్కీ దీనిమీద […]

రాజు: నీ బ్యాగులో ఏమిటవి?
రంగ: కోళ్ళు
రాజు: వాటిల్లో నాకొకటి ఇయ్యవూ?
రంగ: ఇవ్వను
రాజు: సరే! పోనీ నీ సంచిలో ఎన్ని కోళ్ళున్నాయో నేను కరెక్టుగా చెబుతే నాకొకటిస్తావా?
రంగ: నువ్వు కరెక్ట్‌గా చెబితే దీంట్లో వున్న రెండూ నీకిచ్చేస్తా!

——————-

ఒక పార్టీలో ఒక టేబుల్‌ కాసేపు ఇక్కడ వుంటే మరికొంతసేపటికి మరో చోట కనిపిస్తోంది. వెయిటర్‌ ఆశ్చర్యపోయి “ఏమైంది దీనికి?” అని అడిగాడు.
“ఎవరో గెస్టు ఒక బాటిల్‌ విస్కీ దీనిమీద పోశాడు. అప్పట్నించీ తూలుతూ తిరుగుతోంది” అన్నాడు మత్తులో ఉన్నతను.

——————-

తల్లి: ఏం తింటున్నావ్‌?
కొడుకు: యాపిల్‌ పండు.
తల్లి: పురుగులుంటాయి జాగ్రత్త.
కొడుకు: వాటి సంగతి అవి చూసుకుంటాయిలే మమ్మీ!

——————-

టీచర్‌: టిప్పుసుల్తాన్‌ ఏ యుద్దంలో మరణించాడు.
భూషన్‌: చివరి యుద్ధంలో టీచర్‌!

First Published:  9 May 2015 6:37 PM IST
Next Story