కత్రినా ముగ్గురు బిడ్డల తల్లవుతుందా?
స్టార్ హోదాలో ఉన్న హీరోయిన్ లు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాలలో కంటిన్యు అవడానికి ఇష్ట పడతారు. కాని పెళ్లి కి ముందు ఉన్నంత క్రేజ్ ఆ తర్వాత ఉండదు. కాని తమదైన శైలిలో నటించేసి మంచి మార్కులే కొట్టేస్తారు. కొంతమంది పెళ్లి తర్వాత సినిమాలకి దూరంగా ఉంటూ, వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది పెళ్లి తర్వాత సినిమాల మీద ఆసక్తి తగ్గక, మనస్పర్ధలు వచ్చి విడిపోయే వారు కూడా ఉంటారు. కాని […]
BY admin9 May 2015 1:30 PM IST
X
admin Updated On: 11 May 2015 5:35 AM IST
స్టార్ హోదాలో ఉన్న హీరోయిన్ లు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాలలో కంటిన్యు అవడానికి ఇష్ట పడతారు. కాని పెళ్లి కి ముందు ఉన్నంత క్రేజ్ ఆ తర్వాత ఉండదు. కాని తమదైన శైలిలో నటించేసి మంచి మార్కులే కొట్టేస్తారు. కొంతమంది పెళ్లి తర్వాత సినిమాలకి దూరంగా ఉంటూ, వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది పెళ్లి తర్వాత సినిమాల మీద ఆసక్తి తగ్గక, మనస్పర్ధలు వచ్చి విడిపోయే వారు కూడా ఉంటారు. కాని బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ మాత్రం ఈ విషయం పైన ముందుగానే ఒక ప్లాన్ చేసుకున్నాడు.
గత కొంతకాలంగా రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ లు పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరి పెళ్లికి కూడా ముహూర్తాలు త్వరలో ఖరారు కానున్నాయి. ఈ పెళ్ళికి సంబంధించిన చిన్న ఫంక్షన్ ఒకటి ఇరు కుటుంబసభ్యులు చేసుకుంటున్నారని సమాచారం. అయితే, ‘నాకు ముగ్గురు పిల్లలు కావాలి’ అని రణబీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తరువాత కత్రీనా కైఫ్ గ్లామర్ ఉండదు. అన్నింటికి మించి ముగ్గురు పిల్లల ఆలాన పాలన చూడాలి. దీంతో కత్రీనా ఆల్మోస్ట్ సినిమాలకు బయ్ చెప్పాల్సిన పరిస్థితి ఎదురు కావోచ్చు. మరి రణబీర్ కామెంట్ ను లైట్ గా తీసుకుంటుందో..లేక తన కెరీర్ ను మింగేస్తుందని భావించి పెళ్లికి బ్రేక్ లు వేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Next Story