Telugu Global
Others

హైద‌రాబాద్ అభివృద్ధిలో కీల‌కం మెట్రో రైల్: ఎండీ

హైదరాబాద్‌ అభివృద్ధిలో మెట్రో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంద‌ని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి అన్నారు. మీట్‌దిప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ పీపీపీ పద్దతిలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు హైదరాబాద్‌ మెట్రో అని ఆయన తెలిపారు. మెట్రో ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని వెల్లడించారు. బస్‌స్టాండ్లు, రైల్వేస్టేషన్ల సమీపంలోనే మెట్రో స్టేషన్ల నిర్మాణం, అనుకున్న గడువులోపు మెట్రో ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మెట్రో ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 269 ఎకరాల భూమి […]

హైద‌రాబాద్ అభివృద్ధిలో కీల‌కం మెట్రో రైల్: ఎండీ
X
హైదరాబాద్‌ అభివృద్ధిలో మెట్రో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంద‌ని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి అన్నారు. మీట్‌దిప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ పీపీపీ పద్దతిలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు హైదరాబాద్‌ మెట్రో అని ఆయన తెలిపారు. మెట్రో ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని వెల్లడించారు. బస్‌స్టాండ్లు, రైల్వేస్టేషన్ల సమీపంలోనే మెట్రో స్టేషన్ల నిర్మాణం, అనుకున్న గడువులోపు మెట్రో ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మెట్రో ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 269 ఎకరాల భూమి సేకరించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. స్థల సేకరణ కోసం జీహెచ్‌ఎంసీకి ఇప్పటివరకు రూ.620 కోట్ల నిధులు ఇచ్చామని, మరో రూ.200 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. మెట్రో విస్తరణకు ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. మియాపూర్‌ – పటాన్‌చెరు, ఫలక్‌నుమా – శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, తార్నాక – ఈసీఐఎల్‌ వరకు మెట్రో విస్తరణకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. నాగోల్‌ – మెట్టుగూడ మధ్య 8 కిలోమీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయన్నారు. ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నందునే నాగోల్‌ – మెట్టుగూడ మధ్య సర్వీసులు ప్రారంభించలేదని అన్నారు.
First Published:  9 May 2015 11:08 AM IST
Next Story