Telugu Global
Cinema & Entertainment

కంగ‌నా రేంజ్  మారిందా..?

కొన్ని సినిమాలు న‌టీ న‌టుల స్థాయిని మార్చి వేస్తాయి. అదే త‌ర‌హాలో  బాలీవుడ్  న‌టి కంగ‌నా ర‌నౌత్ ను క్వీన్ చిత్ర విజ‌యం మార్చేసిందంటున్నారు బాలీవుడ్ జ‌నాలు.  త‌న స్థాయిని ఆ చిత్రం మార్చిన‌ట్లు  ప్ర‌వ‌ర్తిస్తుంది. క్వీన్ చిత్రంలో కంగ‌నా న‌ట‌న‌కు జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ప్ర‌తి రోల్ ను మ‌హా ప్ర‌సాద‌మ‌ని భావించి అంగీక‌రించాల్సిన ప‌రిస్థితి లేదంటోంది. త‌న రేంజ్ మారింద‌ని  ఫిక్స్ అయ్యింది. […]

కంగ‌నా రేంజ్  మారిందా..?
X
కొన్ని సినిమాలు న‌టీ న‌టుల స్థాయిని మార్చి వేస్తాయి. అదే త‌ర‌హాలో బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ను క్వీన్ చిత్ర విజ‌యం మార్చేసిందంటున్నారు బాలీవుడ్ జ‌నాలు. త‌న స్థాయిని ఆ చిత్రం మార్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తుంది. క్వీన్ చిత్రంలో కంగ‌నా న‌ట‌న‌కు జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ప్ర‌తి రోల్ ను మ‌హా ప్ర‌సాద‌మ‌ని భావించి అంగీక‌రించాల్సిన ప‌రిస్థితి లేదంటోంది. త‌న రేంజ్ మారింద‌ని ఫిక్స్ అయ్యింది. జాతీయ న‌టిగా వ‌చ్చిన గుర్తింపు ను మెయింటిన్ చేసుకునే స్థాయి ఉంద‌ని తేల్చి చెప్పింది. ఏ రోల్ ప‌డితే అవి ఇప్పుడు చేయ‌ద‌ట‌. త‌న‌కు రోల్స్ ఎంపిక‌లో ఫుల్ చాయ‌స్ ఉంద‌ని ఫీల్ అవుతోంది. తాజాగా త‌ను వెడ్స్ మ‌ను రిట‌ర్న్స్ చిత్రం చేస్తుంది. వివాహా వ్య‌వ‌స్థ పై ఇటువంటి చిత్రం ఇంత వ‌ర‌కు రాలేద‌ని చెప్పింది. సో క్వీన్ సినిమా ..కంగ‌న ఆలోచ‌న విధాన‌నీ మార్చి వేసింది. ఈ మార్పు ఎంత వ‌రుకు కంగ‌నాకు స‌హాయ ప‌డుతుందో లెట్సె వెయిట్ అండ్ సీ.
First Published:  9 May 2015 6:38 AM IST
Next Story