ఆర్టీసీ... సమ్మె విరమించండి: హైకోర్టు... కొనసాగిస్తాం: ఈయూ
సమ్మెను తక్షణం విరమించి విధుల్లో చేరాల్సిందిగా హైకోర్టు ఆదేశిస్తే… తాము చట్టబద్దంగానే సమ్మె చేస్తున్నామని, దీన్ని కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మిక నేతలు చెబుతున్నారు. రెండు ప్రజా ప్రయోజన వాజ్యాలను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఇచ్చిన తీర్పు కొత్త వివాదానికి తెర లేపింది. సమ్మె తక్షణం విరమించాల్సిందిగా హైకోర్టు ఆర్టీసీ కార్మికులను ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ నేత సి.ఎల్. వెంకట్రావు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈమేరకు తీర్పు ఇచ్చింది. రెండు […]
BY sarvi9 May 2015 11:09 AM IST
X
sarvi Updated On: 9 May 2015 11:53 AM IST
సమ్మెను తక్షణం విరమించి విధుల్లో చేరాల్సిందిగా హైకోర్టు ఆదేశిస్తే… తాము చట్టబద్దంగానే సమ్మె చేస్తున్నామని, దీన్ని కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మిక నేతలు చెబుతున్నారు. రెండు ప్రజా ప్రయోజన వాజ్యాలను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఇచ్చిన తీర్పు కొత్త వివాదానికి తెర లేపింది. సమ్మె తక్షణం విరమించాల్సిందిగా హైకోర్టు ఆర్టీసీ కార్మికులను ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ నేత సి.ఎల్. వెంకట్రావు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈమేరకు తీర్పు ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లో నిషేధం అమలులో ఉన్న సమయంలో సమ్మె చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని, అత్యవసర సేవలకు భంగం కలిగించినట్టేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమ్మె కొనసాగించడానికి ఇక ఫుల్‌స్టాఫ్ పెట్టి తక్షణం విధుల్లో చేరాలని ఆదేశించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల రెండు రాష్ట్రాల్లో జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమ్మెను విరమించేలా వెంటనే ఆదేశాలివ్వాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను, ఆర్టీసీని, యూనియన్ నాయకులను పేర్కొన్నారు. ఇదే అంశంపై చిత్తూరు జిల్లాకు చెందిన మహమ్మద్ గౌస్ మరో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. రెండింటినీ పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె అక్రమమని తీర్పు చెప్పింది. సిబ్బంది తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.. కాగా సమ్మెపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కోర్టు తీర్పుకు భిన్నంగా స్పందించాయి. తమ సమ్మెకు చట్టబద్ధత ఉందని, నోటీసు ఇచ్చి పద్ధతి ప్రకారమే తాము సమ్మెలోకి దిగామని దీన్ని యధావిధిగా కొనసాగిస్తామని ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ అన్నారు. హైకోర్టు ఆదేశాలు పూర్తి స్థాయి ఆదేశాలు కాదని, తాము న్యాయపరంగానే సమ్మె చేస్తున్నామని ఆయన తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీలను పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటామని… అప్పటివరకు సమ్మెను కొనసాగిస్తామని ఈయూ, టీఎంయూ నాయకులు తెలిపారు.
Next Story