ఆర్టీసీ ఎండీతో కార్మిక సంఘాల చర్చలు మళ్ళీ విఫలం
ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాలు శుక్రవారం సాయంత్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చలు జరుగుతున్న సమయంలో టీఎంయూనేత అశ్వత్థామరెడ్డి, అర్టీసీ ఎండి సాంబశివరావుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. దాంతో మధ్యలోనే ఆర్టీసీ ఎండి వెళ్లిపోయారు. కార్మిక సంఘాల నేతలు కూడా బయటకు వచ్చేశారు. కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ ఆర్టిసీ ఎండీ సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. సమ్మెను అణచివేసే దిశగా ఎండీ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువైపులా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో, […]
BY Pragnadhar Reddy8 May 2015 10:30 PM IST
Pragnadhar Reddy Updated On: 9 May 2015 2:07 AM IST
ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాలు శుక్రవారం సాయంత్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చలు జరుగుతున్న సమయంలో టీఎంయూనేత అశ్వత్థామరెడ్డి, అర్టీసీ ఎండి సాంబశివరావుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. దాంతో మధ్యలోనే ఆర్టీసీ ఎండి వెళ్లిపోయారు. కార్మిక సంఘాల నేతలు కూడా బయటకు వచ్చేశారు. కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ ఆర్టిసీ ఎండీ సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. సమ్మెను అణచివేసే దిశగా ఎండీ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువైపులా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో, ఆమోదయోగ్యమైన, సానుకూల వాతావరణంలో చర్చలు జరగాలని కోరుకుంటున్నామని, కానీ పరిస్థితి అలా లేదని సంఘాల నేతలు అన్నారు. హిట్లరిజంతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఎండీ సాంబశివరావు తప్పుడు ప్రకటనలు చేయవద్దని కార్మిక విజ్ఞప్తి చేశారు. ఈసారి ఎండీ గనక చర్చలకు పిలిస్తే వెళ్లేది లేదని తెలంగాణ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. శనివారం వంటా వార్పు అన్ని డిపోలలో నిర్వహిస్తామని అలాగే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని, తదుపరి కార్యాచరణ తెలియజేస్తామని కార్మిక నేతలు వెల్లడించారు.
Next Story