ప్రత్యేక హోదాను ప్రధానికి గుర్తు చేశాం: సుజనా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని తాము ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరినట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. రాష్ట్రానికి చెందిన ప్రతినిధుల బృందంతో ఆయన శుక్రవారం ప్రధానమంత్రిని కలిశారు. లోటు బడ్జెట్‌ను భర్తీ చేసుకునేందుకు నిధులు కేటాయించాలని తాము ప్రధానిని కోరామని, రాష్ట్రానికి సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని సుజనా చెప్పారు. జూన్ 2లోగా విభజన వల్ల తలెత్తిన సమస్యలు పరిష్కరించుకుంటామని ఆయనకు చెప్పినట్టు తెలిపారు. కాగా బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ […]
BY sarvi7 May 2015 2:20 PM GMT
sarvi Updated On: 8 May 2015 4:39 AM GMT
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని తాము ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరినట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. రాష్ట్రానికి చెందిన ప్రతినిధుల బృందంతో ఆయన శుక్రవారం ప్రధానమంత్రిని కలిశారు. లోటు బడ్జెట్‌ను భర్తీ చేసుకునేందుకు నిధులు కేటాయించాలని తాము ప్రధానిని కోరామని, రాష్ట్రానికి సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని సుజనా చెప్పారు. జూన్ 2లోగా విభజన వల్ల తలెత్తిన సమస్యలు పరిష్కరించుకుంటామని ఆయనకు చెప్పినట్టు తెలిపారు. కాగా బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ చేయనంత సాయం ఆంధ్రప్రదేశ్‌కి చేసిందని చెప్పారు. మోడీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఏపీకీ ఇప్పటికే చాలా నిధులు మంజూరు చేసిందని… ఇంకా చేస్తుందని కంభంపాటి అన్నారు.
Next Story