మళ్లీ ఏ మాయ చేస్తారో..?
నాగచైతన్య కెరీర్ లో డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో చేసిన ఏ మాయ చేశావే చిత్రం నిస్సందేహాంగా ఒక మంచి చిత్రమని చెప్పొచ్చు. అటు నాగ చైతన్య కెరీర్ తో పాటు.. ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన సమంత స్టార్ హీరోయిన్ కావడానికి కూడా పునాది వేసింది. ఓ క్యూట్ లవ్ స్టోరీతో గౌతమ్ మీనన్ నిజంగా మాయ చేశాడు. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. గౌతమ్ మీనన్, నాగచైతన్య మరోసారి జట్టు కట్టడానికి రెడి అయ్యారని. […]
BY admin8 May 2015 2:53 AM IST
X
admin Updated On: 8 May 2015 6:39 AM IST
నాగచైతన్య కెరీర్ లో డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో చేసిన ఏ మాయ చేశావే చిత్రం నిస్సందేహాంగా ఒక మంచి చిత్రమని చెప్పొచ్చు. అటు నాగ చైతన్య కెరీర్ తో పాటు.. ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన సమంత స్టార్ హీరోయిన్ కావడానికి కూడా పునాది వేసింది. ఓ క్యూట్ లవ్ స్టోరీతో గౌతమ్ మీనన్ నిజంగా మాయ చేశాడు. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. గౌతమ్ మీనన్, నాగచైతన్య మరోసారి జట్టు కట్టడానికి రెడి అయ్యారని. ఈ మధ్య ఒక కథను నాగ చైతన్యకు దర్శకుడు గౌతమ్ మీనన్ వినిపించారట. ఆ కథ చైతు కు బాగ నచ్చడం ..సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడం జరిగింది అనేది న్యూస్. ఏ మాయ చేశావే సినిమా మాదిరి… ఇది కూడా ఒక ప్రేమ కథే అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందని నాగ చైతన్య సన్నిహితుల సమాచారం. ఈ మధ్య వచ్చిన దోచేయ్ చిత్రం నాగచైతన్య కు పెద్ద సక్సెస్ ఇవ్వలేక పోయిన విషయం తెలిసిందే.
Next Story