Telugu Global
Others

ప్ర‌శాంతంగా ముగిసిన ఎంసెట్‌

ఎక్క‌డా ఏ అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఇంజినీరింగ్‌, మెడిసిన్ కామ‌న్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ (ఎంసెట్)లు ముగిశాయి. ఆర్టీసీ ఉద్యోగుల స‌మ్మెతో తీవ్ర ఉత్కంఠ‌కు గురైన విద్యార్థులు, వారి త‌ల్లిదండ్ర‌లు ఊపిరి పీల్చుకున్నారు. ప‌రీక్ష‌కు ఆల‌స్యంగా వ‌స్తే ఒక్క నిమ‌ష‌మైనా అనుమ‌తించ‌మ‌న్న అధికారుల ప్ర‌క‌ట‌న‌ల‌తో భ‌య‌ప‌డిన విద్యార్థులు త‌ర్వాత అర‌గంట సేపు ఆల‌స్య‌మైనా అనుమ‌తించ‌డం చాలా చోట్ల విద్యార్థుల‌కు క‌లిసి వ‌చ్చింది. పోలీసులు, రాజ‌కీయ నాయ‌కులు… ఇలా ఎవ‌రికివారు విద్యార్థుల‌కు గ‌మ్య‌స్థానాల‌కు చేర్చ‌డంలో అడుగ‌డుగునా స‌హ‌కారం అందించ‌డంతో స‌మ‌యానికి […]

ఎక్క‌డా ఏ అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఇంజినీరింగ్‌, మెడిసిన్ కామ‌న్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ (ఎంసెట్)లు ముగిశాయి. ఆర్టీసీ ఉద్యోగుల స‌మ్మెతో తీవ్ర ఉత్కంఠ‌కు గురైన విద్యార్థులు, వారి త‌ల్లిదండ్ర‌లు ఊపిరి పీల్చుకున్నారు. ప‌రీక్ష‌కు ఆల‌స్యంగా వ‌స్తే ఒక్క నిమ‌ష‌మైనా అనుమ‌తించ‌మ‌న్న అధికారుల ప్ర‌క‌ట‌న‌ల‌తో భ‌య‌ప‌డిన విద్యార్థులు త‌ర్వాత అర‌గంట సేపు ఆల‌స్య‌మైనా అనుమ‌తించ‌డం చాలా చోట్ల విద్యార్థుల‌కు క‌లిసి వ‌చ్చింది. పోలీసులు, రాజ‌కీయ నాయ‌కులు… ఇలా ఎవ‌రికివారు విద్యార్థుల‌కు గ‌మ్య‌స్థానాల‌కు చేర్చ‌డంలో అడుగ‌డుగునా స‌హ‌కారం అందించ‌డంతో స‌మ‌యానికి ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోగ‌లిగారు.
ఇంజినీరింగ్‌, మెడిసిన్ కామ‌న్ ఎంట్ర‌న్స్ ప‌రీక్ష రాసే దూర ప్రాంత విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశామ‌ని ఏపీ ర‌వాణా శాఖ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు అన్నారు. ఏపీలో 7658 మంది ఇంజినీరింగ్ ప‌రీక్ష‌కు హాజ‌రుకాలేద‌ని, హైద‌రాబాద్‌లో హాజ‌రుకాని వారి సంఖ్య కేవ‌లం 215 మాత్ర‌మేన‌ని ఆయ‌న తెలిపారు. అంటే 97.2 శాతం మంది ఇంజినీరింగ్ ఎంట్ర‌న్స్ ప‌రీక్ష రాశార‌ని ఆయ‌న చెప్పారు. ఉద‌యం 9 గంట‌ల నుంచి 62 శాతం బ‌స్సులు న‌డిపామ‌ని శిద్దా చెప్పారు. రేపు కూడా బ‌స్సులు ఈరోజు మాదిరిగానే తిరుగుతాయ‌ని ఆయ‌న అన్నారు.
First Published:  8 May 2015 12:01 PM IST
Next Story