జీఎస్‌టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్నుల విధానాన్ని అమలు చేసే ఉద్దేశ్యంతో రూపొందించిన వస్తు సేవల బిల్లు (జిఎస్‌టీ)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో ఎక్సైజ్, సర్వీస్, వ్యాట్, ఎంట్రీ, ఆక్ర్టాయ్, ఇతర రాష్ట్ర పన్నుల స్థానంలో ఒకే ఒక పన్నును విధించి పన్నుల వ్యవస్థలను సరళీకరించేందుకు మార్గం సుగమమైంది. జీఎస్‌టీని అమలు చేసేందుకు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో అనుకూలంగా 352 మంది ఓటువేయగా, వ్యతిరేకంగా 37మంది ఓటువేశారు. అయితే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభ […]
BY Pragnadhar Reddy7 May 2015 2:49 AM IST
X
Pragnadhar Reddy Updated On: 7 May 2015 2:49 AM IST
దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్నుల విధానాన్ని అమలు చేసే ఉద్దేశ్యంతో రూపొందించిన వస్తు సేవల బిల్లు (జిఎస్‌టీ)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో ఎక్సైజ్, సర్వీస్, వ్యాట్, ఎంట్రీ, ఆక్ర్టాయ్, ఇతర రాష్ట్ర పన్నుల స్థానంలో ఒకే ఒక పన్నును విధించి పన్నుల వ్యవస్థలను సరళీకరించేందుకు మార్గం సుగమమైంది. జీఎస్‌టీని అమలు చేసేందుకు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో అనుకూలంగా 352 మంది ఓటువేయగా, వ్యతిరేకంగా 37మంది ఓటువేశారు. అయితే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభ సభ్యుడైనప్పటికీ సభలో లేకపోవడంతో ఆయన ఓటింగ్‌లో పాల్గొనలేదు. కాగా, రాజ్యసభ గండం కూడా గట్టెక్కి, కనీసం 50 శాతం రాష్ట్రాలు జీఎస్‌టీని ఆమోదిస్తే వచ్చే ఏడాది ఏప్రిల్ 1నుంచి అమలులోకి వస్తుంది. జీఎస్‌టీ విధించడం వల్ల రాష్ట్రాలకు కలిగే ఎలాంటి నష్టాన్నైనా కనీసం అయిదేళ్లపాటు భరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేయడంతో తృణమూల్, బీజేడీతో సహా పలు విపక్షాలు బిల్లుకు మద్దతునిచ్చాయి. బిల్లును మరోసారి స్థాయీ సంఘానికి నివేదించాలని పట్టుబట్టిన కాంగ్రెస్ డిమాండ్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిరస్కరించారు. నిపుణుల కమిటీ సూచించిన 27 శాతం కంటే తక్కువగా జీఎస్‌టీ ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చినా కాంగ్రెస్ వాకౌట్ చేసి పరోక్షంగా బిల్లుకు మద్దతు పలికింది. గురువారం ఈ బిల్లు రాజ్యసభకు రానుంది. బీజేపీ సంఖ్యాబలం తక్కువగా ఉన్నందున ఈ సభలో ఆ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో చూడాలి.
Next Story