Telugu Global
Others

పూజారి ఇంట్లో పురాత‌న విగ్ర‌హాలు

హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పరిధిలోని ఒక పూజారి ఇంట్లో రాజుల కాలపు పురాతన వస్తువులు, విగ్రహాలు కొలువుతీరాయి. ఈ విష‌యం ఆనోటా ఈనోటా పోలీసుల చెవికి చేరింది. వెంట‌నే ఎస్సార్ నగర్ పోలీసులు బాబురావు అనే పూజారి ఇంట్లో సోదాలు చేశారు. వారికి క‌ళ్ళు చెదిరిపోయే రాజుల కాలం నాటి పురాతన వస్తు సామగ్రి కంట‌బ‌డింది. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి… అస‌లు ఇన్ని విగ్ర‌హాలు, విలువైన పురాత‌న […]

పూజారి ఇంట్లో పురాత‌న విగ్ర‌హాలు
X
హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పరిధిలోని ఒక పూజారి ఇంట్లో రాజుల కాలపు పురాతన వస్తువులు, విగ్రహాలు కొలువుతీరాయి. ఈ విష‌యం ఆనోటా ఈనోటా పోలీసుల చెవికి చేరింది. వెంట‌నే ఎస్సార్ నగర్ పోలీసులు బాబురావు అనే పూజారి ఇంట్లో సోదాలు చేశారు. వారికి క‌ళ్ళు చెదిరిపోయే రాజుల కాలం నాటి పురాతన వస్తు సామగ్రి కంట‌బ‌డింది. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి… అస‌లు ఇన్ని విగ్ర‌హాలు, విలువైన పురాత‌న వ‌స్తువులు పూజారికి ఎలా ల‌భించాయో దర్యాప్తు ప్రారంభించారు. పూజారి బాబూరావు ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఈ వస్తువులలో రాధాకృష్ణులు, నటరాజస్వామి విగ్రహాలు, మరో 35 రకాల విగ్రహాలు, వందేళ్ల కిందటి బైనాక్యులర్స్, దీపాలు, ఈస్టిండియా కంపెనీ కాలపు నాణేలు, విక్టోరియా పాకెట్ కంపాస్ లాంటి అమూల్యమైనవి ఎన్నో ఉన్నాయి. వీటి విలువ మార్కెట్‌లో మూడున్న‌ర‌ కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.
First Published:  6 May 2015 6:40 PM IST
Next Story