హిట్ రన్ కేసులో సల్మాన్ దోషి... కోర్టు నిర్దారణ
సల్మాన్ అభిమానులకు, కుటుంబసభ్యులకు ఈరోజు ఒక చీకటి రోజు. హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ను దోషిగా నిర్దారిస్తూ ముంబాయి సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ కారు మీతిమీరిన వేగంతో నడుపుతూ ఒకరి మృతికి మరో నలుగురు గాయపడడానికి కారణమైనట్టు జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. 13 సంవత్సరాలుగా కొనసాగిన ఈ కేసులో మొత్తం 28 మంది సాక్ష్యులను విచారించారు. వీరిలో ఒక్కరు మాత్రమే సల్మాన్‌కు అనుకూలంగా సాక్ష్యం […]
BY Pragnadhar Reddy5 May 2015 6:30 PM IST
X
Pragnadhar Reddy Updated On: 6 May 2015 9:59 AM IST
సల్మాన్ అభిమానులకు, కుటుంబసభ్యులకు ఈరోజు ఒక చీకటి రోజు. హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ను దోషిగా నిర్దారిస్తూ ముంబాయి సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ కారు మీతిమీరిన వేగంతో నడుపుతూ ఒకరి మృతికి మరో నలుగురు గాయపడడానికి కారణమైనట్టు జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. 13 సంవత్సరాలుగా కొనసాగిన ఈ కేసులో మొత్తం 28 మంది సాక్ష్యులను విచారించారు. వీరిలో ఒక్కరు మాత్రమే సల్మాన్‌కు అనుకూలంగా సాక్ష్యం చెప్పగా మిగిలిన వారంతా వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పారు. కారు నడిపిన సమయంలో సల్మాన్ తాగి ఉన్నారన్న విషయం ప్రాసిక్యూషన్ నిరూపించింది. సల్మాన్‌పై పెట్టిన ఎనిమిది అభియోగాలు అన్నీ నిరూపితమయ్యాయని న్యాయమూర్తి తెలిపారు. కేసు చివరిదశలో తన డ్రైవర్ అశోక్‌సింగ్ కారు నడిపాడని సల్మాన్ లాయర్‌తో తప్పుడు సమాచారం ఇప్పించారని న్యాయమూర్తి అన్నారు.
సల్మాన్‌పై న్యాయమూర్తి ప్రశ్నల వర్షం కురిపించారు. నీవు ఉద్దేశ్యపూర్వకంగా ప్రమాదం చేసి ఉండకపోవచ్చు. కాని తప్పతాగి కారు నడపడం తప్పు కాదా? అంటూ ప్రశ్నించారు. నీవు చేసిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు… నలుగురు గాయపడ్డారు… దీనికి నీకు పదేళ్ళు శిక్ష పడుతుందని తెలుసా? అని అడిగారు. ఇంకా ఏమైనా చెప్పదలచుకున్నావా? అని న్యాయమూర్తి ప్రశ్నించినపుడు సల్మాన్ మౌనంగా తలదించుకుని ఉండిపోయారు. కోర్టు హాలులోనే ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. జడ్జి వైపు చూస్తూ మౌనంగా సల్మాన్ ఉండిపోవడం చూసి కుటుంబసభ్యులు నిశ్చేష్ఠులయ్యారు. న్యాయమూర్తి తీర్పు పాఠాన్ని చదివి వెళ్ళిన తర్వాత సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని సరార్ధర్ జైలుకు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. కోర్టు తుది తీర్పు వెలువడిన తర్వాత సల్మాన్‌కు మూడేళ్ళకు మించి శిక్ష పడితే ఆయనకు బెయిల్ కూడా లబించదు.
ఈ కేసులో ప్రమాదం జరిగిన వెంటనే సల్మాన్‌ను అరెస్ట్ చేయలేదు. 2006లో ఆయనపై కేసు నమోదు చేశారు. 2007 అక్టోబర్ 3న అతనిపై అభియోగాలు నమోదు చేసి 4న అరెస్ట్ చేశారు. అయితే 24న ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతూనే ఉంది. మొత్తం 28 మంది సాక్షులను విచారించగా ఒక్కరు మాత్రమే సల్మాన్‌కు అనుకూలంగా సాక్ష్యం చెప్పారు.
Next Story