సమ్మెలోని ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగం?
ఆర్టీసీ కార్మకులపై ఏస్మా ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తోంది యాజమాన్యం. రేపటి లోగా కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగాల్లోకి రాకపోతే ఎస్మా ప్రయోగిస్తామని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. లక్షా 20 వేల మంది కార్మికులు విధుల్లోకి రాకుంటే ప్రయివేటు సిబ్బందితో బస్సులు నడుపుతామని పేర్కొంది. ఆర్టీసీ భారీగా నష్టపోతున్న దృష్ట్యా సమ్మెను విరమించుకోవాలని ఆర్టీసీ ఎండి కోరారు. ఆర్టీసీ ప్రస్తుతం 5000 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని, ఉద్యోగులు కోరినట్టు వారికి 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే […]
BY admin6 May 2015 8:01 AM IST
admin Updated On: 6 May 2015 8:01 AM IST
ఆర్టీసీ కార్మకులపై ఏస్మా ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తోంది యాజమాన్యం. రేపటి లోగా కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగాల్లోకి రాకపోతే ఎస్మా ప్రయోగిస్తామని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. లక్షా 20 వేల మంది కార్మికులు విధుల్లోకి రాకుంటే ప్రయివేటు సిబ్బందితో బస్సులు నడుపుతామని పేర్కొంది. ఆర్టీసీ భారీగా నష్టపోతున్న దృష్ట్యా సమ్మెను విరమించుకోవాలని ఆర్టీసీ ఎండి కోరారు. ఆర్టీసీ ప్రస్తుతం 5000 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని, ఉద్యోగులు కోరినట్టు వారికి 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే మరో 2800 కోట్లు జీతాలు పెరుగుతాయని, ఇది సంస్థకు మరింత భారమవుతుందని ఆయన పేర్కొన్నారు. గత యేడాది ఆర్టీసీకి రూ. 950 కోట్ల నష్టం వచ్చిందని, ఇది ఈయేడాది నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. 27 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడానికి తాము సిద్ధమయ్యామని, దీనివల్ల రూ.1800 కోట్లు భారం పడుతుందని, కాని ఎంప్లాయిస్ యూనియన్లు 43 శాతం కావాలంటూ మంకు పట్టు పడుతున్నాయని, దీన్ని అమలు చేయాలంటే 15 శాతం ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
ప్రత్యమ్నాయ ఏర్పాట్లలో ఆర్టీసీ
ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగించినా బస్సులను యధావిధిగా తిప్పేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా హెవీ లైసెన్సులున్న మూడున్నర లక్షల మంది డ్రైవర్ల వివరాలను రవాణ శాఖ నుంచి తెప్పించుకుంది. రోజుకు వంద రూపాయల పన్ను చెల్లించి బస్సులు నడుపుకోవచ్చని పేర్కొంది. ప్రయాణికులను చేరవేయడానికి కాంట్రాక్టు క్యారియర్లు, టూరిస్టు బస్సులు, ఫ్యాక్టరీ బస్సులకు అనుమతి ఇస్తున్నామని ఆర్టీసీ ఎండి తెలిపారు.
Next Story