Telugu Global
Others

ప్రైవేటు డ్రైవర్లపై ఆర్టీసీ కార్మికుల దాడి

త‌మ‌కు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండు చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగటంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు కార్మికులను తాత్కాలిక ప్రాతిప‌దిక‌గా నియామ‌కాలు జ‌ర‌ప‌డానికి నిర్ణయించింది. డ్రైవ‌ర్‌కు రూ. 800, కండ‌క్ట‌ర్‌కు రూ. 1000 ఇవ్వాల‌ని నిర్ణ‌యించి అర్హులైన నిరుద్యోగుల‌కు ఆహ్వానం ప‌లికింది. ఇలా ఉద్యోగాల్లో చేరిన వారిపై ఆర్టీసీ సిబ్బంది దాడుల‌కు దిగుతున్నారు. ఒంగోలు డిపోలో ప్రైవేటు కార్మికులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ డిపోలో ఓ ప్రైవేటు డ్రైవరుపై […]

త‌మ‌కు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండు చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగటంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు కార్మికులను తాత్కాలిక ప్రాతిప‌దిక‌గా నియామ‌కాలు జ‌ర‌ప‌డానికి నిర్ణయించింది. డ్రైవ‌ర్‌కు రూ. 800, కండ‌క్ట‌ర్‌కు రూ. 1000 ఇవ్వాల‌ని నిర్ణ‌యించి అర్హులైన నిరుద్యోగుల‌కు ఆహ్వానం ప‌లికింది. ఇలా ఉద్యోగాల్లో చేరిన వారిపై ఆర్టీసీ సిబ్బంది దాడుల‌కు దిగుతున్నారు. ఒంగోలు డిపోలో ప్రైవేటు కార్మికులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ డిపోలో ఓ ప్రైవేటు డ్రైవరుపై ఆర్టీసీ కార్మికులు దాడి చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు ఆర్టీసీ డిపోలో ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నెల్లూరు జిల్లా గూడూరు డిపో వద్ద ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు.
First Published:  5 May 2015 7:00 PM IST
Next Story