Telugu Global
Cinema & Entertainment

దీపికను వెనక్కినెట్టిన పోర్న్ స్టార్

సన్నీ లియోన్ బేసిగ్గా పోర్న్ స్టారే కావొచ్చు. కానీ ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో నిజంగా స్టార్. ఆమె కాల్షీట్ కావాలంటే కోట్లు సమర్పించుకోవాలి. సెట్స్ పైకి తీసుకురావాలంటే నెలల తరబడి వెయిట్ చేయాలి. ఆ క్రేజే ఇప్పుడు సన్నీని టాప్ లో నిలబెట్టింది. ఎస్ ఆర్ ఎమ్ శివాజీ గణేషన్ ఫిలిం ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఓ సర్వేలో సన్నీలియోన్ టాప్ లో నిలిచింది. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2014లో సన్నీలియోన్ కు ప్రధమస్థానం దక్కింది. బాలీవుడ్ హాట్ […]

దీపికను వెనక్కినెట్టిన పోర్న్ స్టార్
X
సన్నీ లియోన్ బేసిగ్గా పోర్న్ స్టారే కావొచ్చు. కానీ ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో నిజంగా స్టార్. ఆమె కాల్షీట్ కావాలంటే కోట్లు సమర్పించుకోవాలి. సెట్స్ పైకి తీసుకురావాలంటే నెలల తరబడి వెయిట్ చేయాలి. ఆ క్రేజే ఇప్పుడు సన్నీని టాప్ లో నిలబెట్టింది. ఎస్ ఆర్ ఎమ్ శివాజీ గణేషన్ ఫిలిం ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఓ సర్వేలో సన్నీలియోన్ టాప్ లో నిలిచింది. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2014లో సన్నీలియోన్ కు ప్రధమస్థానం దక్కింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకోన్ గట్టిపోటీనిచ్చినప్పటికీ రెండో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక సౌత్ నుంచి శృతిహాసన్ కు 23వ స్థానం దక్కితే.. అనుష్క కు 37వస్థానం లభించింది. డిజైనరబుల్ ఉమెన్ లిస్ట్ లో మూడో స్థానంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నాలుగో స్థానంలో కత్రినాకైఫ్ నిలిచారు. ఆశ్చర్యకంగా ఐదోస్థానం శ్రియకు దక్కింది. ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్, నర్గిస్ ఫక్రి, అలియాభట్ లాంటి హాట్ హాట్ భామలంతా శ్రియ తర్వాత స్థానాల్ని అలంకరించారు. చెప్పుకోవడానికి గమ్మత్తుగా ఉన్నప్పటికీ సర్వేలో నిగ్గుతేలిన నిజాలండీ బాబు ఇవన్నీ.
First Published:  5 May 2015 9:00 AM IST
Next Story