పరిటాల సునీత అలక తీర్చిన తెలుగుదేశం
అనంతపురం : తన మనుషులకు విలువ లేకుండా చేస్తున్నారని, తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ అలిగిన పరిటాల సునీత అలక తీర్చే పనిలో తెలుగుదేశం పడింది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రసాదరెడ్డి హత్య నేపథ్యంలో ఉద్యోగాల నుంచి తాత్కాలికంగా పక్కకు పెట్టిన ఇద్దరు పోలీసు అధికారులకు మళ్ళీ రెండు రోజుల్లోనే పోస్టింగులు వచ్చాయి. వీరిద్దరిపై చర్యకు అలిగిన పరిటాల సునీత మళ్ళీ తిరిగి పోస్టుంగ్‌లు […]
BY Pragnadhar Reddy4 May 2015 5:58 AM IST
X
Pragnadhar Reddy Updated On: 4 May 2015 10:39 AM IST
అనంతపురం : తన మనుషులకు విలువ లేకుండా చేస్తున్నారని, తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ అలిగిన పరిటాల సునీత అలక తీర్చే పనిలో తెలుగుదేశం పడింది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రసాదరెడ్డి హత్య నేపథ్యంలో ఉద్యోగాల నుంచి తాత్కాలికంగా పక్కకు పెట్టిన ఇద్దరు పోలీసు అధికారులకు మళ్ళీ రెండు రోజుల్లోనే పోస్టింగులు వచ్చాయి. వీరిద్దరిపై చర్యకు అలిగిన పరిటాల సునీత మళ్ళీ తిరిగి పోస్టుంగ్‌లు ఇప్పించుకోవడం ద్వారా తన పంతం నెగ్గించుకున్నారు. రాప్తాడులో వైసీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ఎస్‌ఐ, సీఐలను అనుమానిస్తూ ఉన్నతాధికారులు వీరిని వీఆర్‌కు పంపించారు. అయితే ఈ విషయంలో మంత్రి పరిటాల సునీత కల్పించుకోవడంతో వారికి తిరిగి పోస్టింగులు ఇచ్చారు. ఒకవైపు తన మనుషులను వేధిస్తూ మరోవైపు తన కుమారుడికి జిల్లాలో ప్రాధాన్యత లేకుండా చేస్తున్న కొంతమంది తెలుగుదేశం నాయకుల వైఖరిని ఆమె తప్పు పడుతున్నారు. సరిగ్గా ఈ నేపథ్యంలోనే తన నియోజకవర్గం పరిధిలో ఉండే ఇద్దరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని సునీత సహించలేకపోయారు. ఫలితంగా ఆమె అలిగారు. ఈ ఆలక తీర్చే చర్యల్లో భాగంగా ఎస్సై, సీఐలకు పోస్టింగ్‌లిచ్చారన్నది నిజం.
Next Story