కేసీఆర్ టీచర్ అవతారం
ముఖ్యమంత్రి కేసీఆర్ టీచర్ అవతారం ఎత్తారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‑లోని విజయ విహార్‑లో జరుగుతున్న టీఆర్ఎస్ శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో దూషణలు, కొట్టుకోవడం మంచి సంప్రదాయం కాదని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు హుందాగా మసలుకోవాలని కోరారు. సభలో కీలక అంశాలపై బిల్లు ప్రవేశపెట్టినపుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పకుండా చర్చలో పాల్గొనాలన్నారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులకు మరింత శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు. తనదైన శైలిలో చలోక్తులు విసురుతూ ఆద్యంతం పదునైన మాటలతో నేతలకు […]
ముఖ్యమంత్రి కేసీఆర్ టీచర్ అవతారం ఎత్తారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‑లోని విజయ విహార్‑లో జరుగుతున్న టీఆర్ఎస్ శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో దూషణలు, కొట్టుకోవడం మంచి సంప్రదాయం కాదని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు హుందాగా మసలుకోవాలని కోరారు. సభలో కీలక అంశాలపై బిల్లు ప్రవేశపెట్టినపుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పకుండా చర్చలో పాల్గొనాలన్నారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులకు మరింత శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు. తనదైన శైలిలో చలోక్తులు విసురుతూ ఆద్యంతం పదునైన మాటలతో నేతలకు రాజకీయ పాఠాలు చెప్పారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత చట్టసభల్లో విపక్ష సభ్యుల ఆందోళనలు, అధికార పక్షం ప్రత్యారోపణలతో పలుమార్లు సభ దద్దరిల్లింది. కొత్త ప్రభుత్వంలో ఎన్నికైన ఎమ్మెల్యేల్లో చాలామంది తొలిసారిగా ఎంపికైనవారే. వీరికి రాజకీయ నేపథ్యం తక్కువ. వీరిలో ఎక్కువమంది ఉద్యమకారులే. ఉద్యమం, రాజకీయాలు రెండు వేర్వేరు. ఉద్యమంలో ఉండాల్సిన దూకుడు రాజకీయంలో పనిచేయదు. ఇక్కడ బుద్ధి కుశలత ఉండాలి. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు.