Telugu Global
Cinema & Entertainment

డైరెక్ట‌ర్ నిత్య విద్యార్ధి..! 

ఆర్టిస్ట్ అనే వాడు అప్ డేట్ అవ్వ‌క పోతే రాణించ‌లేడంటారు. ఇది నిజ‌మే అంటున్నారు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు. తెలుగు సినిమాలో ద‌ర్శ‌కుడి కుర్చికి గౌర‌వం తెచ్చిన వారిలో ఆయ‌న అగ్ర‌జుడు అని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు. 70 ఏళ్ల వ‌య‌సులోను ఇప్ప‌టికీ సినిమాలంటే ఎంతో ఆస‌క్తిగా చేసే ఈ ఘ‌న‌పాటి.. డైరెక్ట‌ర్ అనే వాడు నిత్య విద్యార్ధి అని తెలిపారు. అయితే త‌న సినిమాలు అభిమానులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యార‌ని వాపోయారు. ఎందుకంటే ఈ జ‌న‌రేష‌న్ […]

డైరెక్ట‌ర్ నిత్య విద్యార్ధి..! 
X

ఆర్టిస్ట్ అనే వాడు అప్ డేట్ అవ్వ‌క పోతే రాణించ‌లేడంటారు. ఇది నిజ‌మే అంటున్నారు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు. తెలుగు సినిమాలో ద‌ర్శ‌కుడి కుర్చికి గౌర‌వం తెచ్చిన వారిలో ఆయ‌న అగ్ర‌జుడు అని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు. 70 ఏళ్ల వ‌య‌సులోను ఇప్ప‌టికీ సినిమాలంటే ఎంతో ఆస‌క్తిగా చేసే ఈ ఘ‌న‌పాటి.. డైరెక్ట‌ర్ అనే వాడు నిత్య విద్యార్ధి అని తెలిపారు. అయితే త‌న సినిమాలు అభిమానులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యార‌ని వాపోయారు. ఎందుకంటే ఈ జ‌న‌రేష‌న్ కు కావాల్సింది త‌ను ఇవ్వ‌లేకె పోతున్నాని..త‌న సినిమాల ద్వార చెప్పేది ఈ జేన‌రేష‌న్ కు న‌చ్చ‌డం లేద‌ని అన్నారు.

వెట‌కార‌పు సినిమాల్ని ఇష్ట‌ప‌డే వారే థియేట‌ర్స్ కు వ‌స్తున్నార‌ని చెప్పారు. అందుకే త‌న నిర్మాత‌గా ప‌వ‌ర్ స్టార్ తో చేయ‌బోయో సినిమాకు క‌థ‌ను ఆయ‌న అభిమానులు ఇష్ట‌ప‌డే రీతిలో వుంటుంద‌న్నారు.అటువంటి క‌థ‌ల్నే వింటున్నార‌ట‌. త‌ను డైరెక్ట్ చేసి ఒక స్టార్ హీరో కెరీర్ ను ఫ‌ణంగా పెట్టలేన‌ని తెలిపారు. రాజ‌క‌పూర్, సి పుల్ల‌య్యలు వారు చ‌నిపోయో వ‌ర‌కు చిత్రాలు చేశారు. వారు అప్ డేట్ కావ‌డం వ‌ల‌నే చివ‌రి వ‌ర‌కు చేయ‌గ‌లిగారు. త‌న‌కూడా నిత్య విద్యార్దినే అన్నారు. మ‌రి ఈ నిత్య విద్యార్ధి నిండు నూరేళ్లు జీవించాల‌ని కోర‌కుంటూ ఆయ‌నకు జ‌న్మదిన శుభాకాంక్ష‌లు .

First Published:  4 May 2015 3:30 PM IST
Next Story