Telugu Global
Cinema & Entertainment

ఈసారి అనుష్క అనుమానమే..

హీరో సూర్య -హీరోయిన్ అనుష్కది విడదీయరాని బంధం. సింగం, సింగం-2 సినిమాలు రెండింటిలో ఈ జంట మైమరిపించింది. ఈ రెండు సినిమాలు హిట్టయ్యాయి. దీంతో సింగం-3కి ప్లాన్ చేస్తున్నాడు సూర్య. హరి దర్శకత్వంలో మరోసారి పోలీస్ గెటప్ లో సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమౌతున్నాడు. కానీ ఈ సినిమాలో అనుష్క ఉంటుందా.. ఉండదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తాజా సమాచారం ప్రకారం సింగం-3లో అనుష్కను కాకుండా హన్సికను తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. దీనికి రెండు కారణాలు […]

ఈసారి అనుష్క అనుమానమే..
X
హీరో సూర్య -హీరోయిన్ అనుష్కది విడదీయరాని బంధం. సింగం, సింగం-2 సినిమాలు రెండింటిలో ఈ జంట మైమరిపించింది. ఈ రెండు సినిమాలు హిట్టయ్యాయి. దీంతో సింగం-3కి ప్లాన్ చేస్తున్నాడు సూర్య. హరి దర్శకత్వంలో మరోసారి పోలీస్ గెటప్ లో సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమౌతున్నాడు. కానీ ఈ సినిమాలో అనుష్క ఉంటుందా.. ఉండదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తాజా సమాచారం ప్రకారం సింగం-3లో అనుష్కను కాకుండా హన్సికను తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. దీనికి రెండు కారణాలు చెబుతున్నారు. రీసెంట్ గా అనుష్క తమిళనాట పెద్దగా విజయాలు నమోదు చేయకపోవడం ఒక కారణమైతే, ప్రస్తుతం ఆమె ఫిజిక్ సూర్య సరసన సెట్ కాదనేది రెండో కారణంగా కనిపిస్తోంది. మరోవైపు కోలీవుడ్ లో హన్సికకు ఫుల్ డిమాండ్ ఉంది. హన్సిక ఉందంటే చాలు ఆ సినిమా చూస్తున్నారు జనాలు. అదీకాకుండా సింగం సిరీస్ లో నటించిన అనుభవం కూడా హన్సికకు ఉంది. దీంతో మ్యాగ్జిమమ్ హన్సిక వైపే మొగ్గుచూపుతున్నాడు సూర్య. సో.. ఏదో అద్భుతం జరిగితే తప్ప అనుష్క, సూర్య సరసన కనిపించేది డౌటే.
First Published:  4 May 2015 5:07 AM IST
Next Story