4 రాష్ట్రాల నుంచి బాధితులు... అగ్రిగోల్డ్‌పై కన్నెర్ర!
విజయవాడ: అగ్రిగోల్డ్ అక్రమాలకు బలైపోయిన తమకు న్యాయం చేయాలని ఆ సంస్థ బాధితులు సోమవారం విజయవాడ నగరంలో మహాధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది బాధితులు ఇక్కడకు చేరారు. అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయం దగ్గరకు వారిని వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు పది వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ అగ్రిగోల్డ్ సంస్థ అధినేతలను కఠినంగా శిక్షించాలని కోరుతూ మండుటెండలో మిట్ట మధ్యాహ్నం బాధితులు రోడ్డెక్కారు. తమ డబ్బులు తమకు […]
BY Pragnadhar Reddy4 May 2015 9:02 AM IST
X
Pragnadhar Reddy Updated On: 4 May 2015 9:02 AM IST
విజయవాడ: అగ్రిగోల్డ్ అక్రమాలకు బలైపోయిన తమకు న్యాయం చేయాలని ఆ సంస్థ బాధితులు సోమవారం విజయవాడ నగరంలో మహాధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది బాధితులు ఇక్కడకు చేరారు. అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయం దగ్గరకు వారిని వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు పది వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ అగ్రిగోల్డ్ సంస్థ అధినేతలను కఠినంగా శిక్షించాలని కోరుతూ మండుటెండలో మిట్ట మధ్యాహ్నం బాధితులు రోడ్డెక్కారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని నడిరోడ్డు మీద బాధితులు కన్నీరుమున్నీరవు తున్నారు. కూలీనాలీ చేసి సంపాదించి… తినీతినక కూడబెట్టిన పైసలు తాము ఏజంట్లను నమ్మి వారి చేతిలో పెట్టామని వారు బోరుమన్నారు. ఉద్యోగం కోసం సంస్థలో చేరిన ఏజంట్లను తామేం అడగగలమని వారు ప్రశ్నిస్తూనే తమ డబ్బులు తమకు ఇప్పించమని పోలీసులకు విన్నపాలు చేశారు. ఈ బాధితులతోపాటు ఏజంట్లు కూడా వీరితో జత కలిసి తమ గోడు వెళ్ళబోసుకునే ప్రయత్నం చేశారు.
నాలుగు రాష్ట్రాల్లో బ్రాంచీల ద్వారా వేలాది కోట్ల రూపాయలు సేకరించిన అగ్రిగోల్డ్ ఎన్నిసార్లు అడిగినా డిపాజిట్లు తిరిగి ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. రెండు విడతలుగా ఇచ్చిన చెక్కులు ఒక్కసారి కూడా చెల్లలేదని… బ్యాంకులో వేసిన ప్రతిసారీ బౌన్స్ అయ్యాయని తెలిపారు. డిపాజిట్ల పేరుతో నిధులు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఒకటికి పది రెట్లు నగదు ఇస్తామని చెప్పిన అగ్రిగోల్డ్ ప్రతినిదులు రూపాయకి పది రూపాయలు వస్తాయని ఆశ చూసిన అగ్రిగోల్డ్ సంస్థ అసలుకే ఎసరు పెట్టింది. భారీగా డిపాజిట్లు వసూలు చేసిన అగ్రిగోల్డ్ వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డిలర్లకు లాభాలు పంచుతామని హామీ ఇచ్చింది. డిపాజిట్లు తిరిగి ఇమ్మంటే రౌడీలను పెట్టి దాడులు చేయించారని బాధితులు గోడు వెళ్ళబోసుకున్నారు.
అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళడానికి బాధితులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. సంస్థతో పోలీసులు లాలూచీ పడి తమను వెళ్ళనివ్వడం లేదంటూ బాధిత మహిళలు ఆరోపించారు. బ్యారికేడ్లతో ప్రదర్శకులను అదుపుచేయడానికి ప్రయత్నించిన పోలీసులకు బాధితులు ఎదురు తిరిగారు. ఈ నేపథ్యంలో భారీగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఇద్దరు మహిళలు సృహ తప్పి పడిపోయారు. అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళకుండా బాధితులను విజయవాడ బందరు రోడ్డులో పోలీసులు నిలిపివేశారు. దీంతో బాధితులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసు ఉన్నతాధికారులతోపాటు ఇద్దరు డీజీపీలు సంఘటన స్థలికి వచ్చి బాధితులను అదుపు చేయడానికి యత్నించారు. వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కాని స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఇక్కడి నుంచి కదిలేది లేదని బాధితులు భీష్మించారు. మొత్తం మీద విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన బాధితులు పెద్దగా ర్యాలీ తీస్తున్నారు.
Next Story