Telugu Global
Others

మేలో స్టాక్ మార్కెట్ గ‌మ‌నం పైకా... కింద‌కా?

సాధారణంగా ప్రతి ఏడాది మే నెల మార్కెట్‌కు అత్యంత కీలకమైనదిగా మార్కెట్‌ వర్గాలు భావిస్తాయి. మే నెలలో మార్కెట్‌ భారీ ఆటుపోట్లు గుర‌వుతూ ఉండడమే ఇందుకు కారణం. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలలు రెండింటిలోనూ మార్కెట్‌ నష్టాలతోనే ముగిసింది. ఈ నేపథ్యంలో మే నెల ఎలా ఉంటుందన్నది కీలకం అయింది. ‘అమ్ముకుని బయటపడు’ అన్నది మే నెల‌లో మార్కెట్‌ వర్గాల్లో సాధారణంగా వినవచ్చే మాట. గత రెండు దశాబ్దాలుగా మే నెలలో మార్కెట్‌ కదలికలు గమనిస్తే […]

సాధారణంగా ప్రతి ఏడాది మే నెల మార్కెట్‌కు అత్యంత కీలకమైనదిగా మార్కెట్‌ వర్గాలు భావిస్తాయి. మే నెలలో మార్కెట్‌ భారీ ఆటుపోట్లు గుర‌వుతూ ఉండడమే ఇందుకు కారణం. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలలు రెండింటిలోనూ మార్కెట్‌ నష్టాలతోనే ముగిసింది. ఈ నేపథ్యంలో మే నెల ఎలా ఉంటుందన్నది కీలకం అయింది. ‘అమ్ముకుని బయటపడు’ అన్నది మే నెల‌లో మార్కెట్‌ వర్గాల్లో సాధారణంగా వినవచ్చే మాట. గత రెండు దశాబ్దాలుగా మే నెలలో మార్కెట్‌ కదలికలు గమనిస్తే స్టాక్‌ ఇండెక్స్‌లు బేసి సంవత్సరాల్లో పెరగడం, సరి సంవత్సరాల్లో తగ్గడం ఆన‌వాయితీగా వ‌స్తోంది. గత 23 సంవత్సరాల్లో 12 సరి సంవత్సరాలు రాగా 10 సంవత్సరాల్లో మార్కెట్‌ పతనాలనే చవి చూసిందని, 11 బేసి సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాల్లో లాభపడిందని మార్కెట్ విశ్లేష‌కులు గణాంకాల ఆధారంగా చెబుతున్నారు. అయితే 2014 సంవత్సరం సరి సంవత్సరమే అయినా సాధారణ ధోరణికి భిన్నంగా మే నెలలో మార్కెట్‌ సుమారు 1700 పాయింట్ల వృద్ధిని సాధించింది. ఈ సరి, బేసి సంవత్సరాల ధోరణి ప్రకారం చూస్తే ఈ ఏడాది బేసి సంవత్సరం గనుక మే నెలలో మార్కెట్‌ ఎగువకే పయనించాలన్నది వారి అంచనా. ప్రస్తుతం నెలకొన్న బేరిష్‌ ధోరణి చూస్తే ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మార్చి 31నాటికి షేర్ల విలువ‌ను ఆధారం చేసుకుని చెప్పాలంటే…ఇన్వెస్ట‌ర్ల సంప‌ద‌ 101.49 లక్షల కోట్లుంది. ఇది ఏప్రిల్ 30నాటికి 99.7 లక్షల కోట్ల రూపాయలకు దిగజారింది. అంటే ఇన్వెస్టర్ల సంపద 1.79 లక్షల కోట్ల రూపాయల మేరకు ఆవిరైపోయిందన్న మాట. ఏడాదిన్నరకి పైగా బుల్స్‌ చెలరేగిపోవ‌డం వ‌ల్లే ఇపుడు మార్కెట్‌కు మ‌ద్ద‌తు ల‌బించ‌క పోవ‌డానికి కారణమని విశ్లేషకులంటున్నారు.-పీఆర్‌
First Published:  2 May 2015 6:31 PM IST
Next Story