Telugu Global
Others

భూములు ఇచ్చేస్తాం... మళ్లీ లాక్కుంటాం... మంత్రి నారాయణ

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 2018 నాటికి మొదటి దశ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. తమ భూములు తమకు ఇప్పంచాలంటూ హైకోర్టుకెళ్లిన రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని, అదే సమయంలో భూ సేకరణ చట్టం ద్వారా ఆ భూములను మళ్లీ తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కొన్ని రాజ‌కీయ […]

భూములు ఇచ్చేస్తాం... మళ్లీ లాక్కుంటాం... మంత్రి నారాయణ
X
విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 2018 నాటికి మొదటి దశ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. తమ భూములు తమకు ఇప్పంచాలంటూ హైకోర్టుకెళ్లిన రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని, అదే సమయంలో భూ సేకరణ చట్టం ద్వారా ఆ భూములను మళ్లీ తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కొన్ని రాజ‌కీయ పార్టీలు తెర వెనుక ఉండి రైతుల‌తో నాట‌కాలాడిస్తున్నాయ‌ని, ఇవ‌న్నీ త‌మ‌కు తెలుస‌ని ఆయ‌న అన్నారు. హైకోర్టు ఆదేశాల మేర‌కు భూముల ఇచ్చి వేస్తామ‌ని… కాని రాజ‌ధాని అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని వాటిని మ‌ళ్ళీ తీసుకోవ‌ల‌సి వ‌స్తే తీసుకుని తీర‌తామ‌ని నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. స్వ‌చ్ఛాంధ్ర‌ప్ర‌దేశ్‌లో భాగంగా జూన్‌లో రెండు లక్షల మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు.
First Published:  3 May 2015 2:52 AM IST
Next Story