ఈ తెలుగమ్మాయి ఫ్యూచర్ ఎలా ఉంటుందో..?
మాములుగా సినిమా ఇండస్ట్రీ లో తెలుగు అమ్మాయిల హవా ఎక్కువగా ఉండదు. దానికి కారణాలు ఏవేవో చెప్తూ ఉంటారు. ఎన్ని కారణాలు చెప్పినా, అవి ఏమాత్రం నిజాలు కావు అంటూ కొంత మంది తెలుగు స్టార్ లు చెప్తూ ఉంటారు. అయినా కాని తెలుగు హీరోయిన్ లు మాత్రం ఎక్కువగా ఈ ఫీల్డ్ కి రావడానికి ఇష్టపడటం లేదు. అలా డేర్ చేసి వచ్చి నిలబడింది మాత్రం కలర్స్ స్వాతి ఒక్కటే. యాంకర్ గా కెరీర్ మొదలు […]
BY Pragnadhar Reddy3 May 2015 12:19 PM IST
X
Pragnadhar Reddy Updated On: 3 May 2015 12:19 PM IST
మాములుగా సినిమా ఇండస్ట్రీ లో తెలుగు అమ్మాయిల హవా ఎక్కువగా ఉండదు. దానికి కారణాలు ఏవేవో చెప్తూ ఉంటారు. ఎన్ని కారణాలు చెప్పినా, అవి ఏమాత్రం నిజాలు కావు అంటూ కొంత మంది తెలుగు స్టార్ లు చెప్తూ ఉంటారు. అయినా కాని తెలుగు హీరోయిన్ లు మాత్రం ఎక్కువగా ఈ ఫీల్డ్ కి రావడానికి ఇష్టపడటం లేదు. అలా డేర్ చేసి వచ్చి నిలబడింది మాత్రం కలర్స్ స్వాతి ఒక్కటే. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి హిరోయిన్ గా మారిన స్వాతి కి ప్రస్తుతం ఫేం బాగానే ఉందని చెప్పుకోవాలి. ఇక ఈమె బాటలోనే మరో తెలుగు అమ్మాయి తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది.
జులాయి సినిమాలో అల్లు అర్జున్ కి సిస్టర్ గా నటించి కెరీర్ స్టార్ట్ చేసింది శ్రీముఖి. యాంకర్ గా ట్రై చేస్తూ, ఇటు సినిమాల వైపు కుడా అడుగులు వేస్తుంది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్ ‘ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత చిన్న సినిమాలలో ఒక్కొక్కటి చేస్తూ ఉంది. ప్రస్తుతం చంద్రిక 2015, ధనలక్ష్మి తలుపు తడితే అనే రెండు తెలుగు సినిమాలు చేస్తుంది. ఇవే కాక మరో తమిళ్ సినిమా లో కూడా నటిస్తుంది. ఇక ఈ అమ్మడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాల పైనే ఆధారపడి ఉంది.మరి స్వాతి లాగా నిలబడుతుందో లేదో చూడాలి ..!
Next Story