Telugu Global
Others

ప్రమాదం అంచున ప్రకాశం బ్యారేజ్....

నాలుగు జిల్లాల రైతులకు జీవనాధారంగా ఉన్న ప్రకాశం బ్యారేజ్ పై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారులు పట్టించుకోకపోవడంతో బ్యారేజ్ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్ నిపుణులతో తనిఖీలు చేయించి సకాలంలో మరమ్మతులు చేయించకపోవడం వల్ల పెద్ద చిక్కే వచ్చిపడింది. దీంతో వ్యయం కూడా బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం రూ.6 కోట్లతో మరమ్మతులు చేస్తున్నప్పటికీ పనుల నాణ్యతలో అనేక లోపాలున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ కి ఉన్న 72 […]

ప్రమాదం అంచున ప్రకాశం బ్యారేజ్....
X

నాలుగు జిల్లాల రైతులకు జీవనాధారంగా ఉన్న ప్రకాశం బ్యారేజ్ పై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారులు పట్టించుకోకపోవడంతో బ్యారేజ్ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్ నిపుణులతో తనిఖీలు చేయించి సకాలంలో మరమ్మతులు చేయించకపోవడం వల్ల పెద్ద చిక్కే వచ్చిపడింది. దీంతో వ్యయం కూడా బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం రూ.6 కోట్లతో మరమ్మతులు చేస్తున్నప్పటికీ పనుల నాణ్యతలో అనేక లోపాలున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.

ప్రకాశం బ్యారేజ్ కి ఉన్న 72 గేట్లు దెబ్బతిన్నాయి. దీనిపై ఇరిగేషన్ నిపుణుల కమిటీ పరిశీలించి మరమ్మతులు చేయాలని సూచించింది. రూ.6 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే మరమ్మతులు చేసే విషయంలో నాణ్యత లోపాలున్నాయనే ఆరోపణలున్నాయి. దెబ్బతిన్న గేట్లను పూర్తిగా నీటి నుంచి తీసి బాగు చేయాలి. కానీ అలా చేయడం లేదు. బ్యారేజ్ దిగువ నీరు లేకపోవడంతో అటువైపు నుంచి గేట్లకు మరమ్మతులు చేసి మమ అనిపిస్తున్నారు. దీని కారణంగా గేట్లు వంగిపోయే ప్రమాదం ఉందని విశ్రాంత ఇంజినీర్లు చెబుతున్నారు. తొలుత ఎక్స్ యాంగ్లర్స్ మార్చాలని ఇంజినీర్లు భావించారు. తర్వాత గేట్ల పైనుంచి నీరు వస్తుండడంతో ఎత్తు పెంచాలని నిర్ణయించారు. నీటికి, గేటుకు మధ్యలో లీకేజీ కాకుండా రబ్బర్లు మార్చాలని భావించారు. గేట్లను లేపడానికి సపోర్టుగా ఉండే యాంగ్లర్స్ మార్చడం, దెబ్బతిన్న గేట్లకు వెల్డింగ్ చేయించాలని నిర్ణయించారు. ఫలితంగా మరమ్మతుల వ్యయం బాగా పెరిగిపోయింది. బ్యారేజీ దిగువన ఆఫ్రాన్ కూడా దెబ్బతిని రాళ్లు పైకి వచ్చేశాయి. నీరు ఎగువకు వచ్చి బ్యారేజ్ పై ఒత్తిడి పెరుగుతోంది. మొత్తం గేట్లను మూడు భాగాలుగా విభజించి ఏటా ఒక భాగంలోని గేట్లకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. మూడేళ్ల వరకు గేట్లను పట్టించుకోకపోతే దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రకాశం బ్యారేజీ రిజర్వాయర్ లో మేట వేసుకుపోయిన ఇసుక, సిల్ట్ లను డీసిల్టింగ్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్యారేజీకి కిలోమీటరు ఎగువ అనేక సంవత్సరాలుగా ఇసుక మేట వేసినట్లు ఇంజినీర్లు భావిస్తున్నారు. ఇసుక, బుసక, సిల్ట్ లు ఏ మేరకు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇసుక నిల్వలు ఉన్నాయో తెలుసుకునేందుకు పరిశీలిస్తున్నారు. వీటికోసం రిజర్వాయర్ లో 15 చోట్ల నదీగర్భంలో తనిఖీలు చేయిస్తామని ఇంజినీర్లు ఇటీవల‌ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి నదిలో పర్యటించి ఇసుక ఉంటుందని భావించిన ప్రాంతాలను పరిశీలించారు. నదిలో ఉన్న ఇసుకను ఇప్పటికే తీసేశారని, సిల్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

First Published:  3 May 2015 6:30 AM IST
Next Story