Telugu Global
Others

విదేశీ మారక నిల్వల్లో భార‌త్‌ స‌రికొత్త రికార్డు

ముంబై: భారత విదేశీ మారక నిల్వలు సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్‌ 24తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 140 కోట్ల డాలర్లు పెరిగి 34,460 కోట్ల డాలర్లకు చేరాయి. మొత్తం నిల్వల్లో అధిక వాటా కలిగిన విదేశీ కరెన్సీ ఆస్తులు 140 కోట్ల డాలర్లు పెరగడంతో ఈ నిల్వలు 34,460 కోట్ల డాలర్లకు చేరుకున్నట్టు భారత రిజర్వు బ్యాంకు వెల్లడించింది. ఇక బంగారం నిల్వలు 1903 కోట్ల డాలర్ల వద్ద యథాతథంగా ఉన్నాయి. […]

ముంబై: భారత విదేశీ మారక నిల్వలు సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్‌ 24తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 140 కోట్ల డాలర్లు పెరిగి 34,460 కోట్ల డాలర్లకు చేరాయి. మొత్తం నిల్వల్లో అధిక వాటా కలిగిన విదేశీ కరెన్సీ ఆస్తులు 140 కోట్ల డాలర్లు పెరగడంతో ఈ నిల్వలు 34,460 కోట్ల డాలర్లకు చేరుకున్నట్టు భారత రిజర్వు బ్యాంకు వెల్లడించింది. ఇక బంగారం నిల్వలు 1903 కోట్ల డాలర్ల వద్ద యథాతథంగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ 400 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఐఎంఎఫ్‌ వద్ద భారత నిల్వలు 129 కోట్ల డాలర్లుగా ఉన్నాయి.
First Published:  2 May 2015 1:26 PM GMT
Next Story