కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేకహోదా సాధిస్తాం: కాంగ్రెస్
గుంటూరు: కేంద్ర ప్రభుత్వంతో రాజీపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం శనివారం గుంటూరులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నిరశన దీక్షలో పాల్గొన్న ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచయినా ఏపీకి ప్రత్యేకహోదా సాధిస్తామని భరోసా ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వ ఏకపక్ష వైఖరిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, కాంట్రాక్టర్ల కోసమే రాజధాని నిర్మిస్తున్నట్టు ఉందని […]
BY Pragnadhar Reddy1 May 2015 9:25 PM IST
Pragnadhar Reddy Updated On: 2 May 2015 12:26 PM IST
గుంటూరు: కేంద్ర ప్రభుత్వంతో రాజీపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం శనివారం గుంటూరులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నిరశన దీక్షలో పాల్గొన్న ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచయినా ఏపీకి ప్రత్యేకహోదా సాధిస్తామని భరోసా ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వ ఏకపక్ష వైఖరిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, కాంట్రాక్టర్ల కోసమే రాజధాని నిర్మిస్తున్నట్టు ఉందని రఘువీరా అన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని, ఈ అంశంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సాకులు చెప్పడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టంగా చెబుతుంటే బీజేపీతో పొత్తు దేనికని కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ప్రశ్నించారు. కేవలం తమ పార్టీ వారు మంత్రి పదవుల్లో కొనసాగించడానికే చంద్రబాబు మౌనంగా ఉంటున్నారని ఆయన ఆరోపించారు. వడ్డించిన విస్తరిలా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి రాష్ట్రాన్ని అప్పగిస్తే చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలతో నాశనం చేస్తున్నారని చిరంజీవి అన్నారు. ప్రత్యేక హోదా తేవడం చేతకాని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద మోకరిల్లి రాష్ట్ర ఆత్మగౌరవాన్ని పణంగా పెడుతున్నారని ఆయన విమర్శించారు. మోడీ సొంత డబ్బా కొట్టుకుంటూ విదేశాల్లో దేశం పరువు తీస్తున్నారని చిరంజీవి విమర్శించారు.
Next Story