Telugu Global
Cinema & Entertainment

అనుష్కతో రకుల్ పోటి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వీటీ అనుష్క గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, తనకి తానే పోటీ ఇచ్చుకుంటూ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉంటుంది. అందుకే మిగతా హీరోయిన్స్ ని కుడా, ఈ బొమ్మాలి తో పోల్చి చూస్తారు. ఎందుకంటే ఈమెతో పోల్చి చూసేంతగా ఏ హిరోయిన్ స్తాయి సరిపోదు అనేది అందరి ఆలోచన. ఇక ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న మరో హిరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తన అందంతో ఇప్పటికే కుర్రకారుల మనసు […]

అనుష్కతో రకుల్ పోటి..?
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వీటీ అనుష్క గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, తనకి తానే పోటీ ఇచ్చుకుంటూ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉంటుంది. అందుకే మిగతా హీరోయిన్స్ ని కుడా, ఈ బొమ్మాలి తో పోల్చి చూస్తారు. ఎందుకంటే ఈమెతో పోల్చి చూసేంతగా ఏ హిరోయిన్ స్తాయి సరిపోదు అనేది అందరి ఆలోచన. ఇక ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న మరో హిరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తన అందంతో ఇప్పటికే కుర్రకారుల మనసు దోచేసుకుంది ఈ ముద్దు గుమ్మ. ఇప్పుడు ఈ ఇద్దరికీ పోలిక పెట్టాడు ఒక డైరెక్టర్.
రామ్ హీరోగా వస్తున్న ‘పండగ చేస్కో’ సినిమా ఆడియో ఫంక్షన్ లో గోపీచంద్ మలినేని స్టేజ్ పైన రకుల్ ప్రీత్ కి, అనుష్క కి పోలిక ఉందని చెప్పాడు. గతంలో అనుష్క తో పని చేసినప్పుడు తానెప్పుడు చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యేవాడినని చెప్పాడు. ఒక్కో మెట్టు ఎక్కి ఎలా పైకి రావాలో అనుష్కకి బాగా తెలుసని చెప్పాడు. ఈ సినిమా చేస్తున్నప్పుడు రకుల్ కుడా నాకు అనుష్క లాగే కనిపించిందని, రకుల్ కూడా అనుష్క లాగే పైకి ఎదగాలని కోరుకుంటున్నా అని పోగిడేసాడు. ఏది ఏమైనా ఈ మాటలు అనుష్క ని ఇంకో మెట్టు పైకి ఎక్కించినట్లే…
First Published:  2 May 2015 7:48 AM IST
Next Story