సాగర్‌లో టీఆర్ఎస్ క్లాసులు..
తెలంగాణ రాష్ట్ర సమితి తన ప్రజా ప్రతినిధులకు నాగార్జున సాగర్‌లో శిక్షణా తరగతులు నిర్వహించబోతోంది. ఈ నెల రెండో తేదీ నుంచి మూడు రోజుల పాటు వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తరగతులు నిర్వహిస్తారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అంతా సాగర్‌కు మకాం మార్చుతుండటంతో వారితో పాటే అధికార యంత్రాంగం కూడా అక్కడికి తరలివెళుతోంది. మూడు రోజుల పాటు సాగర్ నుంచే సచివాలయాన్ని నడుపుతారు. ఉద్యమ పార్టీ అధికారంలోకి రావడం..పూర్తి రాజకీయ పార్టీగా అవతరించడం వంటి […]
BY Pragnadhar Reddy30 April 2015 6:37 PM IST
Pragnadhar Reddy Updated On: 1 May 2015 5:54 AM IST
తెలంగాణ రాష్ట్ర సమితి తన ప్రజా ప్రతినిధులకు నాగార్జున సాగర్‌లో శిక్షణా తరగతులు నిర్వహించబోతోంది. ఈ నెల రెండో తేదీ నుంచి మూడు రోజుల పాటు వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తరగతులు నిర్వహిస్తారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అంతా సాగర్‌కు మకాం మార్చుతుండటంతో వారితో పాటే అధికార యంత్రాంగం కూడా అక్కడికి తరలివెళుతోంది. మూడు రోజుల పాటు సాగర్ నుంచే సచివాలయాన్ని నడుపుతారు. ఉద్యమ పార్టీ అధికారంలోకి రావడం..పూర్తి రాజకీయ పార్టీగా అవతరించడం వంటి వాటివల్ల చట్టసభల గురించి ప్రజా ప్రతినిధులకు పూర్తి అవగాహన కల్పించడం, వివిధ అంశాలపై శిక్షణ ఇప్పించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏర్పాటు చేశారు. అందరూ ఒకరోజు ముందే సాగర్‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
Next Story