పీటల మీద పెళ్ళి ఆగిపోయింది?
తాళి కట్టి తలంబ్రాలు వేయాల్సిన సమయంలో ఆయనే మా ఆయన… అని ఓ యువతి రావడంతో పీటల మీద పెళ్ళి పెటాకులై పోయింది. తన భర్త మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడని తెలిసి మొదటి భార్య కల్యాణ మండపానికి రావడంతో రెండో పెళ్ళి చేసుకుంటున్న ఆ ఘనుడు అక్కడి నుంచి పరారై పోయాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని ఓ కల్యాణ మండపంలో చోటు చేసుకుంది. సురేంద్ర మోహన్ అనే ఈ రెండో పెళ్ళి […]
BY Pragnadhar Reddy1 May 2015 10:06 AM IST
Pragnadhar Reddy Updated On: 1 May 2015 10:17 AM IST
తాళి కట్టి తలంబ్రాలు వేయాల్సిన సమయంలో ఆయనే మా ఆయన… అని ఓ యువతి రావడంతో పీటల మీద పెళ్ళి పెటాకులై పోయింది. తన భర్త మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడని తెలిసి మొదటి భార్య కల్యాణ మండపానికి రావడంతో రెండో పెళ్ళి చేసుకుంటున్న ఆ ఘనుడు అక్కడి నుంచి పరారై పోయాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని ఓ కల్యాణ మండపంలో చోటు చేసుకుంది. సురేంద్ర మోహన్ అనే ఈ రెండో పెళ్ళి కొడుకు తనను పదేళ్ళ క్రితమే పెళ్ళి చేసుకున్నాడని, తనకు, అతనికి పుట్టిన ఐదేళ్ళ పాప కూడా ఉందని ఉమా మహేశ్వరి అనే యువతి ఆరోపించింది. పీటల మీద ఉన్న పెళ్ళికొడుకును చొక్కా పట్టుకుని నిలదీసింది. ఏం జరుగుతుందో అర్ధం కాని ఆ పెళ్ళికొడుకు కాసేపు నిశ్చేష్టుడైపోయాడు. తేరుకున్న వెంటనే తన మొదటి భార్య తన కళ్ళముందున్న నిజాన్ని నమ్మలేకపోయాడు. అక్కడి నుంచి పలాయనం చిత్తగించే ప్రయత్నం చేశాడు. పారిపోతున్న తన భర్తను కాలరు పట్టుకుని ఆపే ప్రయత్నం చేసిందా యువతి. మహేశ్వరి అనే ఆ యువతి నుంచి ఫిర్యాదు అందుకుని ఆమెతోటే వచ్చి అక్కడే ఉన్న పోలీసులు మాత్రం చోద్యం చూశారు. కాలరు పట్టుకుని నిలదీస్తున్న ఆ యువతిని విదిలించుకుని అక్కడ నుంచి పారి పోయాడు.
అక్కడే ఆమె విలేఖరులతో మాట్లాడుతూ తనకు, సురేంద్రమోహన్ అనే అతనికి పదేళ్ళ క్రితమే పెళ్ళయ్యిందని, తమకు ఐదేళ్ళ పాప కూడా ఉందని తెలిపింది. 2004లో జరిగిన తమ పెళ్ళి సమయంలో దాదాపు కోటి రూపాయల కట్నం ఇచ్చామని అయినా తనను కట్నం కోసం వేధిస్తున్నాడనే కారణంగా అతనిపై హైదరాబాద్‌లో 498 సెక్షన్ కింద కేసు కూడా పెట్టామని ఆమె తెలిపారు. ఇంకా ఆ కేసు తేలకుండా పెళ్ళి చేసుకుంటున్నాడని తెలిసి తాను వచ్చానని ఆమె తెలిపారు. ఈ విషయమై ఏలూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదు అందుకున్న ద్వారకా తిరుమల ఎస్సై సంఘటన స్థలికి వెళ్ళాడని, అక్కడ ఏం జరిగిందో తనకు ఇంకా సమాచారం రాలేదని తెలిపారు. కేసు వివరాలు తెలిసిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Next Story